Health Tips: మలబద్ధకం మాయమవ్వాలంటే.. అల్పాహారంగా వీటిని తినండి!
Health Tips: ఈ రోజులలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు అదేమిటో చూద్దాం.
మలబద్ధకం సమస్య అనేది తేలికగా తీసుకునే సమస్య కాదు, దీర్ఘకాలం పాటు మలబద్ధకం ఉంటే కిడ్నీ సమస్యలు, ఫైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత ముఖం మీద మొటిమలు నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి.
అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉంటే ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినండి. మీరు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఒక చిన్న మెంతి పొడిని వేసుకుని కూడా తీసుకోవచ్చు.
అధిక వాత,కఫ దోషం ఉన్నవారికి ఈ రెమిడీ బాగా పనిచేస్తుంది. అయితే అదిక పిత్త దోషం ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. అలాగే నానబెట్టిన సెనగల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్ విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.
ఇవి అనేక వ్యాధులతో పోరాడటానికి మనకి సహాయపడుతుంది.అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారికి ఈ నానబెట్టిన శనగలు చక్కని అల్పాహారం. నానబెట్టిన సెనగలలో నిమ్మకాయ, సన్నగా తరిగిన అల్లం, ఎండు మిరపకాయల పొడి..
నల్ల ఉప్పు కలిపి ఉదయం పూట తింటే ఆ రోజంతా శక్తి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే రాత్రంతా నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే కూడా మలబద్ధకానికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో ఒక చెంచా నానబెట్టిన సబ్జా గింజలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆ తర్వాత రాత్రంతా నానబెట్టిన ఐదు బాదం పప్పులు, ఒక వాల్నట్, మూడు నల్ల ద్రాక్షలను తీసుకుంటే మంచిది. అలాగే రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ఉదయం తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.అంజీర్ లో విటమిన్ b6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది.