కొత్తిమీరను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?
కొత్తిమీరలో మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. నిజానికి కొత్తమీర మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగ ఉంటుంది. అలాగని దీన్ని రోజూ తింటే..

కొత్తిమీరను చాలా మంది రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగిస్తుంటారు. కొత్తిమీర ఫుడ్ కు మంచి వాసన ఇవ్వడమే కాకుండా టేస్టీగా కూడా చేస్తుంది. అంతేకాదు కొత్తిమీర మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కొత్తిమీరలో న్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్స్, విటమిన్ సి, కె వంటి పోషకాలు కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి.
coriander leaves
కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
కొత్తిమీరలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున ఇది బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి కూడా కొత్తిమీర బాగా సహాయపడుతుంది.
కొత్తిమీర రక్తహీనత సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొత్తిమీర ఆకుల్లో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులను ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కొత్తిమీర మన గుండెకు కూడా మంచి మేలు చేస్తుంది. కొత్తిమీరను తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.
కొత్తిమీర మధుమేహులకు కూడా మంచి ప్రయోజకరంగా ఉంటుంది. కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి కొత్తిమీరను నీటిలో నానబెట్టి ఒక రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీటిని తాగడం వల్ల మధుమేహాన్ని నియంత్రించొచ్చు. కొత్తిమీర ఆకులకు బదులుగా కొత్తిమీర గింజలను కూడా ఉపయోగించొచ్చు.
ఆయుర్వేదం ప్రకారం.. థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కొత్తిమీరను తీసుకోవడం చాలా చాలా మంచిది. కొత్తిమీరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అలాగే కళ్లు, ఎముకల ఆరోగ్యానికి కూడా కొత్తిమీర ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు కొత్తిమీర మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.