బీర్ తాగుతూ వీటిని తిన్నారో మీ పని అంతే ఇక ..!
మందులో మంచింగ్ కోసమని ఏదో ఒకటి తినే అలవాటు చాలా మందికే ఉంటుంది. ఆమ్లేట్, చికెన్ ఫ్రై, చిప్స్ అంటూ ఏవేవో తింటుంటారు. అయితే బీర్ తాగుతూ కొన్ని ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అసలు బీర్ తాగుతూ వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Image: Getty Images
గింజలు
బీర్ ఆరోగ్యానికి మంచిదని కొంతమంది అంటే.. ఇంకొంతమంది ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని అంటుంటారు. ఏదేమైనా బీర్ ను తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. అయితే బీర్ తాగుతూ ఉప్పగా ఉన్న గింజలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. అందుకే బీర్ తాగుతూ గింజలను తినకండి.
మసాలా ఆహారాలు
ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. మందు తాగుతూ మసాలా ఫుడ్ ను తినడానికి ఇష్టపడతారు చాలా మంది. మీకు తెలుసా ? చాలా కారంగా ఉండే ఆహారాలు చేదు రుచిని మార్చుతాయి. అందుకే ఇలాంటి కాంబినేషన్ ను ఇకపై ట్రై చేయకండి.
సిట్రస్ ఫ్రూట్స్
సిట్రస్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కానీ వీటిని బీర్ తో పాటుగా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Image: Getty Images
Wasabi
మీకు సుషీ అంటే ఇష్టమా..? ఇది ఎంత టేస్టీగా ఉన్నా బీర్ తాగుతూ దీన్ని మాత్రం తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది బీర్ రుచిని మారుస్తుంది. అందుకే దీన్ని ఈ టైంలో తినకండి.
చాక్లెట్
చాక్లెట్లను తినే అలవాటు దాదాపుగా అందరికీ ఉంటుంది. వేరైటీగా ఉంటుందని బీర్ తాగుతూ కూడా చాక్లెట్ ను తింటుంటారు కొంతమంది. అయితే బీర్ తాగే సమయంలో లేదా తర్వాత చాక్లెట్ ను తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
salted food
సాల్టెడ్ ఆహార పదార్థాలు
బీరును తాగుతూ ఉప్పగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోండి. ఎందుకంటే వీటిని తినడం వల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అలాగే దాహం ఎక్కువగా అవుతుంది. దీంతో మీరు బీర్ ను ఎక్కువగా తాగే అవకాశం ఉంది.