గోర్లు విరిగిపోతున్నాయా? అయితే ఇలా చేయండి చాలు
గోర్లు బలంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే విటమిన్లను, ఖనిజాలను పుష్కలంగా తీసుకోవాలి. శరీరంలో పోషకాలు లోపిస్తేనే గోర్లు విరిగిపోతుంటాయి. గోర్లు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అకస్మాత్తుగా గోళ్లు విరిగిపోయే సమస్య చాలా మందికే ఉంటుంది. నిజానికి గోర్లు విరిగిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన దైనందిన జీవితంలో అజాగ్రత్తగా చేసే కొన్ని చిన్న చిన్న పనులు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గోర్లు ఎప్పుడూ విరిగిపోవడం కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, ఎముక బలహీనతను సూచిస్తుంది.
పొడి, విరిగిన గోర్లు కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. ఆహారంలో తగినంత ఒమేగా -3 లేకపోతే అది గోర్లలో పగుళ్లకు కారణమవుతుంది. కొన్ని ఆహారాలు గోర్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
గుడ్డు
గుడ్లు విటమిన్ డి, ప్రోటీన్ కి మంచి మూలం. అంతేకాదు దీనిలో విటమిన్ బి 12, ఐరన్, బయోటిన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. గుడ్డు గోర్ల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మీ రోజువారి ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
leafy vegetables
ఆకుకూరలు
ఆకుకూరల్లో క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు గోళ్లు విరిగిపోకుండా కాపాడుతాయి. గోర్లు అందంగా కనిపిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
Image: Getty
చేపలు
చేపలు ప్రోటీన్, సల్ఫర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన మూలం. వివిధ రకాల చేపలు గోళ్లకే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చేపలలో ప్రోటీన్లు, విటమిన్ ఇ, బయోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి.
nuts
గింజలు
గింజలు విటమిన్లు, ఫైబర్స్, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. బాదం, వాల్ నట్స్ వంటి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ నష్టాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. గింజల్లో విటమిన్ బి6, జింక్, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు, విటమిన్లు ఆరోగ్యకరమైన గోర్లు, బలమైన ఎముకలకు చాలా అవసరం.
avocado
అవోకాడో
అవొకాడో మంచి పోషకాహారం. గోర్లు, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖంపై సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది.