MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఇలా చేస్తే వానాకాలంలో ఆరోగ్యంగా ఉంటారు

ఇలా చేస్తే వానాకాలంలో ఆరోగ్యంగా ఉంటారు

వానాకాలం చల్లని చిరుజల్లులనే కాదు ఎన్నో రోగాలను కూడా తెస్తుంది. ఈ  సీజన్ లో మనకు ఎన్నో రోగాలు సోకుతాయి. ఈ వానాకాలంలో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే మాత్రం కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 25 2023, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వర్షాకాలం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ సీజన్ మనకు ఎన్నో రోగాల ముప్పును కలిగిస్తుంది తెలుసా? అందుకే వర్షాకాలంలో ఆరోగ్యంగా తినడం, ఫిట్ గా ఉండటం చాలా అవసరం. ఈ సీజన్ జలుబు, ఫ్లూ, అలర్జీలు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండటానికి ఈ సీజన్ లో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
monsoon diet

monsoon diet

వానాకాలంలో ఆహారపు అలవాట్ల విషయానికొస్తే.. నూనె, కారంగా ఉండే ఆహారాలనే తింటుంటారు.ఈ రకమైన ఆహారాల్లో కొవ్వు, నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ ను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతాయి. అలాగే వేయించిన ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం కావు. అలాగే బరువు పెరగడానికి దారితీస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38
Image: Getty Images

Image: Getty Images

సీజనల్ పండ్లు, కూరగాయలు

వానాకాలంలో మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నారింజ, ఆపిల్, ద్రాక్ష, మామిడి వంటి పండ్లను ఈ సీజన్ లో తప్పనిసరిగా తినండి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే బచ్చలికూర, కాలే వంటి ముదురు ఆకుకూరలను కూడా తినండి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. 

48

హైడ్రేషన్

చాలా మంది వానాకాలంలో నీళ్లను అస్సలు తాగరు. కానీ  ఈ సీజన్ లో కూడా మన శరీరానికి నీళ్లు చాలా చాలా అవసరం. ఎందుకంటే వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈ సీజన్ లో కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అల్లం టీ, తులసి టీ వంటి హెర్బల్ టీలు ఈ సీజన్ లో ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూను తగ్గించడానికి సహాయపడతాయి. 

58

వెచ్చని పానీయాలు

సూప్లు, మూలికా టీలు వంటి వెచ్చని పానీయాలను ఈ సీజన్ లో తప్పకుండా తాగండి. వర్షాకాలంలో మీరు వెచ్చగా ఉండటానికి ఈ పానీయాలు సహాయపడతాయి. గ్రీన్ టీ, చమోమిలే టీ వంటి మూలికా టీలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. కూరగాయల సూప్లు మీ శరీరానికి పోషణను అందిస్తాయి. 
 

68

ప్రోబయోటిక్స్

ఆరోగ్యకరమైన గట్ మొత్తం శరీరాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అందుకే మీ ఆహారంలో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చండి. దీనివల్ల మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. 
 

78

వెల్లుల్లి, ఉల్లిపాయలు

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండటానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలను మీ ఆహారంలో పోషకాలు పెరుగుతాయి. 
 

88
fiber

fiber

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఆయిలీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్ లను తినకండి. వీటికి బదులుగా మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఓట్స్, శనగ పప్పు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను  తినండి. చిప్స్ లేదా వేయించిన సమోసాలు వంటి అనారోగ్యకరమైన స్నాక్స్ కు బదులుగా కాల్చిన గింజలు, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినండి. ఆరోగ్యకరమైన, పోషకాహాన్ని తినండి. ముఖ్యంగా బయట తినడానికి బదులుగా ఇంట్లో తయారుచేసిన భోజనాన్నే తినండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(5.3 ov)45/2
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved