అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!
మనమందరం పరిశుభ్రత చిట్కాలను పక్కాగా పాటిస్తుంటాం. కానీ ఆడవారు యోని పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోరు. దీనివల్లే ఎన్నో వీరు ఎన్నో అంటువ్యాధుల బారిన పడుతుంటారని నిపుణులు అంటున్నారు.

స్త్రీలకు పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. ఇందుకోసం మొత్తం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ చాలా మంది ఆడవారు యోని ఆరోగ్యం గురించి, దాని పరిశుభ్రత గురించి పట్టించుకోరు. ఇదే ఎన్నో అనారోగ్య సమస్యలను, అంటువ్యాధులకు కారణమవుతుంది తెలుసా?
యోని ప్రాంతం చాలా సున్నితమైనది. అలాగే ఎన్నో సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. దీని పీహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉండాలంటే ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే ప్రైవేట్ భాగం నుంచి దుర్వాసన, అసౌకర్యం, దద్దుర్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు లేదా బాక్టీరియల్ వాగినోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా ఆ భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ భాగాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాష్ తప్పనిసరి
యోని ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. మీకు తెలుసా? మీరు ఈ భాగాన్ని మిగతా వాటిలా శుభ్రపర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోని తనకు తానే శుభ్రపరుస్తుంది. అలాగే దాని సహజ పిహెచ్ సమతుల్యతను కలిగి ఉంటుంది. మీరు ఈ భాగానికి సాధారణ సబ్బు లేదా కఠినమైన క్లెన్సర్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి దీని సమతుల్యతకు భంగం కలిగిస్తాయి. అలాగే చికాకు కలిగిస్తాయి. యోనిని శుభ్రం చేయడానికి తేలికపాటి పిహెచ్-సమతుల్య ఉమెన్ వాష్ ను ఎంచుకోండి. లేదా స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో కడగండి. బాహ్య జననేంద్రియ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రం చేయండి. యోని లోపలి భాగాన్ని మాత్రం కడగకండి. తడిగా ఉంచకూడదు.
What to do if menstrual cups get stuck in the vagina
రుతుక్రమ సంరక్షణ
పీరియడ్స్ సమయంలో అంటువ్యాధులను నివారించడానికి పక్కాగా పరిశుభ్రతను పాటించాలి. బ్లీడింగ్ ను బట్టి ప్రతి 4 నుంచి 6 గంటలకు శానిటరీ ప్యాడ్లు, టాంపోన్లు లేదా మెన్స్ట్రువల్ కప్పులను మార్చాలి. చికాకు కలగొద్దంటే హైపో ఆలెర్జెనిక్ ఉత్పత్తులను ఉపయోగించండి. అలాగే శానిటరీ ప్యాడ్ లను మార్చిన ప్రతి సారి సబ్బుతో చేతులను ఖచ్చితంగా కడగండి.
vagina health
శ్వాసించే లోదుస్తులు
ఆడవారు ఇన్నర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్నిహిత ప్రాంతానికి గాలి తాకాలంటే కాటన్ లేదా ఇతర శ్వాసించే వస్త్రాలను ఎంచుకోండి. లోదుస్తులు టైట్ గా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఇవి తేమను, వేడిని ట్రాప్ చేస్తాయి. అలగే బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. పరిశుభ్రత పాటించడానికి ప్రతిరోజూ మీ లోదుస్తులను తప్పనిసరిగా మార్చాలి.
సురక్షితమైన లైంగిక పద్దతులు
స్త్రీల పరిశుభ్రతలో సురక్షితమైన లైంగిక పద్దతులు కూడా చాలా ముఖ్యం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటించాలి. అంటే సెక్స్ కు ముందు తర్వాత ఆడవారు ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయాలి. సంభోగం తర్వాత ఏదైనా బ్యాక్టీరియాను తొలగించడానికి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలి. అలాగే సురక్షితమైన లైంగిక పద్ధతులు, లైంగిక సంక్రమణ అంటువ్యాధుల కోసం క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి.
తుడిచే పద్ధతి
మూత్ర విసర్జన తర్వాత యోనిని కడిగి తడి లేకుండా తుడవాలని నిపుణులు చెబుతున్నారు రీసెర్చ్ గేట్ లో ప్రచురించిన 2010 అధ్యయనం.. స్త్రీ పరిశుభ్రతను నిర్వహించడానికి మూత్ర విసర్జన తర్వాత సరైన తుడిచే పద్ధతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. పాయువు ప్రాంతం నుంచి యోనికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పరిశుభ్రమైన, సున్నితమైన టాయిలెట్ కాగితాన్ని ఉపయోగించాలి. అలాగే ముందు నుండి వెనుకకు తుడవాలి. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
డౌచింగ్ లేదా స్ప్రే
డౌచింగ్, సువాసనగల స్త్రీ స్ప్రేలను ఉపయోగించడం యోని ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పబ్మెడ్ సెంట్రల్ యోని "డౌచ్స్" పై ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. సాధారణ యోని పరిశుభ్రతకు డౌచింగ్ అవసరం లేదు. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. యోని స్వయంగా శుభ్రపరుచుకుంటుంది. ఈ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల అక్కడ చికాకు, పొడి, అసమతుల్యతకు దారితీస్తుంది.