రక్తంలో చక్కెర అకస్మత్తుగా పెరగడానికి, తగ్గడానికి కారణమేంటంటే..?
రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరగడం లేదా తగ్గడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి. ఈ రెండు డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
blood sugar level
మీకు డయాబెటీస్ ఉంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవన శైలి కూడా బాగుండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరగడానికి లేదా తగ్గడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. వీటిని హైపర్గ్లైసీమియా, హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. అయితే రక్తంలో చక్కెర ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది.
diabetes
రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిల సాధారణ లక్షణాలు:
పెరిగిన దాహం
తరచుగా మూత్రవిసర్జన
అలసట, బలహీనత
అస్పష్టమైన దృష్టి
నోరు పొడిబారడం
అకస్మత్తుగా బరువు తగ్గడం
గాయాలు నెమ్మదిగా నయం కావడం
తరచుగా అంటువ్యాధుల బారిన పడటం
diabetes
రక్తంలో తక్కువ చక్కెర స్థాయిల సాధారణ లక్షణాలు
చెమటలు పట్టడం
మైకము లేదా తేలికపాటి తలనొప్పి
ఆకలి
చిరాకు లేదా మానసిక స్థితిలో మార్పులు
వణుకు
బలహీనత, అలసట
తలనొప్పి
చర్మం రంగు మారడం
అస్పష్టమైన దృష్టి
అకస్మాత్తుగా తక్కువ, ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలకు కారణాలు
నిర్జలీకరణం
మీ శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు మీ రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పుష్కలంగా నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
Image: Getty
ఒత్తిడి, భావోద్వేగ కారకాలు
భావోద్వేగ ఒత్తిడి, మానసిక కారకాలు ఒత్తిడి హార్మోన్ల విడుదల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఒత్తిడి తినే విధానాలను లేదా డయాబెటిస్ ను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
artificial sweeteners
కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం
కృత్రిమ స్వీటెనర్లు ఉన్న కోలాలు, రసాలను తాగే అలవాటు ఉందా? అయితే మీరు వెంటనే వీటిని తాగడం మానేయాలి. ఎందుకంటే ఈ కృత్రిమ స్వీటెనర్లు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి అలాగే గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
హార్మోన్ల మార్పులు
రుతుస్రావం, రుతువిరతి లేదా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని, శరీరం గ్లూకోజ్ ను ఎలా ఉపయోగిస్తుందో ప్రభావితం చేస్తాయి. ఇది హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
అనారోగ్యం లేదా సంక్రమణ
వివిధ అనారోగ్యాలు, అంటువ్యాధులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అంటువ్యాధులు ఒత్తిడికి కారణమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఫుడ్ తక్కువ తినడానికి కారణమవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
smoking
ధూమపానం
స్మోకింగ్ మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ ఊపిరితిత్తులు, గుండెకు హాని కలిగిస్తుంది. అలాగే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. మీకు డయాబెటిస్ ఉండి సిగరేట్ తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. స్మోకింగ్ మానేయడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
Image: Getty
శారీరక శ్రమ లేకపోవడం
వ్యాయామం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. గుండె సమస్యలను దూరంగా ఉంచడం, ఎముకలను బలంగా మార్చడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, రక్తపోటును తగ్గించడానికి వ్యాయామం సహాయిపడుతుంది. కానీ మీరు రోజూ వ్యాయామం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అలాగే డయాబెటిస్ మందులు లేదా ఆహారం తీసుకోవడంలో సరైన సర్దుబాట్లు లేకుండా తీవ్రమైన వ్యాయామం చేస్తే రక్తంలో చక్కెర బాగా తగ్గుతుంది.