మలబద్దకానికి అసలు కారణాలు ఇవే..!
ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్దకం లైట్ తీసుకోవాల్సిన చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మలబద్ధకం ఒక సాధారణ సమస్య. నిజానికి మలం గట్టిగా, పొడిగా మారినప్పుడు, ప్రేగు కదలికతో ఇబ్బంది ఉన్నప్పుడు.. దీనిని మలబద్ధకం అంటారు. నూనె, మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి తినకపోవడం, నీళ్లను తక్కువగా తీసుకోవడం, పొట్ట పరిశుభ్రంగా లేకపోవడం వంటివి మలబద్దకానికి కారణాలు. కొంతమందికి మలబద్ధకం సమస్య సాధారణం. మరికొందరికి ఇది ఒక వ్యాధి లేదా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే దీనికి అసలు కారణాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఫైబర్ ఫుడ్ లేకపోవడం
మీరు తినే ఫుడ్ లో డైటరీ ఫైబర్ లేకపోవడం మలబద్దకానికి దారితీస్తుంది. అందుకే మీరు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. రోజుకు కనీసం 2 రకాల కూరగాయలు, ఒక పండు తినడానికి ప్రయత్నించండి. ఇది ప్రేగు కదలికలను పెంచుతుంది. అలాగే ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.
నూనె, మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం
నూనె, మసాలా దినుసులు ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం వస్తుంది. మాంసం, వేయించిన ఆహార పదార్థాలు తినేటప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.
నీటిని తక్కువగా తాగడం
చాలా మంది నీళ్లను తక్కువగా తాగుతారు. నీటిని తక్కువగా తాగడం వల్ల కూడా మలబద్దకం సమస్య వస్తుంది. నీటిని తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని వల్ల మలం గట్టిబడుతుంది. ప్రేగుల కదలికలో ఇబ్బంది ఏర్పడి మలబద్ధకం వస్తుంది.
శారీరక శ్రమ లేకపోవడం
ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా ఇంట్లో కూర్చోవడం, సోమరితనంగా ఉండటం వల్ల కూడా మలబద్దకం సమస్య వస్తుంది. దీనికితోడు శారీరక శ్రమకు బదులుగా ఎక్కువ మానసిక శ్రమ చేయడం, ఒత్తిడిని తట్టుకోవడం కూడా మలబద్దకానికి దారితీస్తుంది.