పీరియడ్స్ ఎక్కువ రోజులు అవుతున్నాయా? అయితే ఇలా చేయండి
విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే ఇది జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మనలో చాలా మందికి తెలియని విషయమేంటంటే? ఇది పీరియడ్స్ ఎక్కువ రోజులు కాకుండా ఆపడానికి కూడా సహాయపడుతుంది.
కొంతమందికి పీరియడ్స్ ఐదు రోజుల కంటే ఎక్కువగా అవుతుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏడు రోజుల కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ అయితే అధిక రుతుస్రావం లేదా మెనోరాగియా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు పీరియడ్ ఉత్పత్తులను తరచుగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ బ్లీడింగ్ ఎక్కువగా కావడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన 2004 అధ్యయనం ప్రకారం.. పీరియడ్స్ లో రక్తం నష్టం 80 మి.లీ కంటే ఎక్కువగా ఉంటే మీకు బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నట్టు.
అధిక రుతుస్రావానికి కారణాలు
పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎక్కువగా కావడం సాధారణం కాదు. బ్లీడింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండే పరిస్థితిని మెనోరాగియా అని పిలుస్తారు. నిపుణుల ప్రకారం.. రక్తస్రావం ఏడు రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, రుతుస్రావం సమయంలో సాధారణం కంటే ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు.. దీనిని దీనిని భారీ రక్తస్రావంగా పరిగణిస్తారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ సమస్య ఉన్నప్పుడు వీలైనంత త్వరగా గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
periods pain
అధిక రక్తస్రావానికి సాధారణ కారణాలు
హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల స్థాయిలలో మార్పులు.. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోయినప్పుడు తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ లో హెచ్చుతగ్గులు లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు
గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్ల పరిమాణం, స్థానం మారే అవకాశం ఉంది. ఇది గర్భాశయ పెరుగుదల, అధిక రుతుస్రావ ప్రవాహానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎండోమెట్రియల్ పాలిప్స్
ఈ గర్భాశయ పొర పెరుగుదల తీవ్రమైన రక్తస్రావం లేదా పీరియడ్స్ మధ్య రక్తస్రావాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక పీరియడ్స్ ను ఆపడానికి విటమిన్
విటమిన్ సి తో రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి యాంటీ ఈస్ట్రోజెనిక్ ప్రభావాలు దీనికి కారణమవుతాయి. కొన్ని పోషకాలను ముఖ్యంగా ఐరన్ ను తీసుకోవడం ద్వారా మీరు ప్రతి నెలా కోల్పోయే పోషకాలను భర్తీ చేయొచ్చు. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన 2007 అధ్యయనం.. విటమిన్ సి అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఈ అధ్యయనంలో అధిక పీరియడ్స్ ఉన్న 18 మంది మహిళలు పాల్గొన్నారు. విటమిన్ సి, బయో ఫ్లేవనాయిడ్లు తీసుకున్నప్పుడు 18 మంది మహిళల్లో 16 మందిలో రక్తస్రావం మెరుగుపడిందని గమనించారు. అలాగే ఇనుము శోషణను పెంచడం ద్వారా మెనోర్హాగియా నుంచి ఇనుము లోపం ఉన్న మహిళలకు విటమిన్ సి సహాయపడుతుంది.
అధిక పీరియడ్స్ ఆపడానికి చిట్కాలు
నాన్స్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు
ఇబుప్రోఫెన్ లేదా నాప్రోక్సెన్ వంటి మందులు రుతుక్రమ రక్త నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. నెలసరి నొప్పి, తిమ్మిరి (డిస్మెనోరియా) నుంచి ఉపశమనం కలిగించే ప్రయోజనం వీటికి ఉందని నిపుణులు అంటున్నారు.
periods
ట్రానెక్సామిక్ ఆమ్లం
ట్రానెక్సామిక్ ఆమ్లం రుతుక్రమ రక్త నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తస్రావం సమయంలో మాత్రమే వీటిని తీసుకోవాలి.
నోటి గర్భనిరోధకాలు
వీటిని సాధారణంగా జనన నియంత్రణ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. కానీ నోటి గర్భనిరోధకాలు రుతు చక్రాలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఇవి అధిక లేదా దీర్ఘకాలిక రుతుస్రావాన్ని తగ్గిస్తాయి.
నోటి ప్రొజెస్టెరాన్
ప్రొజెస్టెరాన్ హార్మోన్ అసమతుల్యతను సరిచేయడానికి, మెనోరాగియాను తగ్గించడానికి సహాయపడుతుంది.