ఏసీలో పడుకుంటే వడదెబ్బ తగులుతుంది.. నమ్మరు కానీ ఇది నిజం
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్లనే తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా AC ల వినియోగం పెరగడం కూడా వాతావరణ మార్పులకు కారణం అంటున్నారు. అసలు AC గాలి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం పొడిబారిపోతుంది..
ఎయిర్ కండిషనర్.. గాలిలో ఉండే తేమను తొలగిస్తుంది. అందువల్ల కళ్ళు పొడిబారిపోతాయి, మంటలు రావడం జరుగుతుంది. చర్మం కూడా పొడిబారిపోయి చికాకు కలిగిస్తుంది. చాలా అసౌకర్యంగా ఉండి నిద్ర కూడా సరిగా పట్టదు.
ఆహారం అరగదు..
చల్లని ఉష్ణోగ్రతలు జీర్ణ వ్యవస్థ అని తీరును తగ్గిస్తాయి. దీంతో తిన్న ఆహారం అరగక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలసట పెరుగుతుంది.
డీ హైడ్రేషన్..
AC గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల శరీరం తెలియకుండా డీహైడ్రేషన్ కు గురవుతుంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీళ్లు తాగాలన్న ఆలోచన కూడా రాదు. దీంతో డీహైడ్రేట్ అయిపోతుంది.
చిన్న పిల్లలు జాగ్రత్త
AC లను ఎల్లప్పుడూ 25-27 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నవజాత శిశువులకు నేరుగా AC గాలి తగలకుండా చూడాలని సలహా ఇస్తున్నారు.
బ్యాక్టీరియా, వైరస్ లతో ప్రమాదం
ఎయిర్ కండిషనర్ ను తరచూ శుభ్రం చేయకపోతే దాని ద్వారా కంటికి కనిపించని దుమ్ము విడుదలవుతుంది. అందులో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు ఉంటాయి. వీటి వల్ల ఉబ్బసం, అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి.