గుండె ఆరోగ్యానికి ఈ ప్రోటీన్ చాలా చాలా అవసరం..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రోటీన్లను ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ ప్రోటీన్లు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

heart
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, స్థూలకాయం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొదట మీ అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. వీటితో పాటు ఆహారం, పానీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ ఫుడ్ లో గుండె ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్నో ఇతర సమ్మేళనాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి ఎలాంటి ప్రోటీన్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
heart
దీనిపై పరిశోధన ఏం చెబుతుందంటే?
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. సంతృప్త కొవ్వులను కలిగున్న మాంసాలను తింటూ అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకునే వారు చాలా మంది అమెరికన్లు ఉన్నారు. సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెరుగుతుంది. హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడా ప్రకారం.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే కొన్ని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఉన్నాయి. కానీ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎన్నో ఆహారాలలో గుండె సంబంధిత సమస్యలను ప్రోత్సహించే భాగాలు కూడా ఉన్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ కొవ్వు మాంసాలను మొక్కల ఆధారిత ఆరోగ్యకరమైన ప్రోటీన్లతో భర్తీ చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
pumpkin seeds
విత్తనాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చియా విత్తనాలు, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ తో పాటుగా ఒమేగా 3 కొవ్వులు కడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ 2018 లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ విత్తానాల్లోని ఫైబర్, ఇతర పోషకాలు గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
టోఫు
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2014 లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. సోయా ప్రోటీన్ తో తయారైన టోఫు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనితో పాటగా ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను మన శరీరానికి అందిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
2020 లో సర్క్యులేషన్ ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. టోఫును వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. టోఫులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని ఎన్నో అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.
മീൻ
చేపలు
హాట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి మాట్లాడితే.. ఇలాంటి వాటిలో చేపలు ఉత్తమమైనవి. కార్డియోవాస్క్యులర్ సమస్యలున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
ట్యూనాలో తగినంత ప్రోటీన్, తగినంత మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు దీనిలో విటమిన్ బి 12, విటమిన్ డి, నియాసిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
సాల్మన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. దీనితో పాటుగా దీనిలో భాస్వరం, పొటాషియం, సెలీనియం, విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
సాదా పెరుగు
పెరుగు వంటి ఎక్కువ కొవ్వు పాల ఉత్పత్తుల్లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి తక్కువ కొవ్వు ఉన్న పెరుగు బాగా సహాయపడుతుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచేటప్పుడు హృదయ స్పందనను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
బీన్స్
బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి సూపర్ ఫుడ్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ కు గొప్ప మూలం. వీటిలో తగినంత మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్ గా ఉంటాయి.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. వీటిలో పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి గుండెను ఆరోగ్యంగాఉంచే ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత ప్రోటీన్ ను అందుతుంది.