తిన్న వెంటనే నడిస్తే ఏమౌతుంది?
తిన్న వెంటనే కొంతమంది పడుకుంటే.. మరికొంతమంది అలా బయట నడుస్తుంటారు. నిజానికి మీరు తిన్న ప్రతి సారి 10 నిమిషాలు గనుక నడిస్తే ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే?
ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాలి. కానీ తినడంతో పాటుగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అప్పుడే బరువు పెరగకుండా ఉండారు. హెల్తీగా ఉంటారు. కానీ బరువు తగ్గడానికి చాలా ఈజీ మార్గం ఉందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు ప్రతి సారి తిన్న తర్వాత జస్ట్ 10 నిమిషాలు నడిస్తే సులువుగా బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది మిమ్మల్ని బరువు పెరగకుండా చేసి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.
ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
తిన్న తర్వాత ఖచ్చితంగా నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ నడక కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే నడక మీ కడుపు, ప్రేగులను కదిలిస్తుందిది. దీంతో మీరు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక అధ్యయనం కనుగొంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది
స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. తిన్న వెంటనే నడవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. భోజనం చేసిన తర్వాత తేలికపాటిగా నడిస్తే మీ రక్తంలో చక్కెర హెచ్చు తగ్గులు మాడ్యులేట్ అవుతాయి. ఇది మీ ఇన్సులిన్ స్థిరత్వాన్ని కాపాడుతుంది. మీరు తిన్న వెంటనే నడిస్తే మంచి ఫలితం పొందుతారు. ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా ఉండే రాత్రి భోజనం తర్వాత నడిస్తే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు పెరగవు.
రక్తపోటును తగ్గిస్తుంది
భోజనం చేసిన తర్వాత నడిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నడక గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మూడు సార్లు 10 నిమిషాలు నడవడం వల్ల ప్రీహైపర్టెన్షన్ ఉన్నవారిలో డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక చిన్న పాటి నడక కూడా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ని భోజన సమయాలను రిమైండర్ గా ఉపయోగించండి.
Walking
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
భోజనం చేసిన తర్వాత నడిస్తే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తిన్న తర్వాత నడిస్తే కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు చాలా వరకు తగ్గుతాయి. అలాగే ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్లను పెంచుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగించడానికి, రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అందుకే ఆఫీసుకు దగ్గర కాకుండా.. కొంచెం దూరంలో బైక్ లేదా కార్ ను పార్కింగ్ చేయడం, ఎలివేటర్లకు బదులుగా మెట్లు ఎక్కడం, భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వంటి అలవాట్లను అలవర్చుకోండి.