The Warriorr:జగన్ ఫ్యాన్స్ సినిమాని బోయ్ కాట్ చేసారా? అందుకే....
రాజకీయాలు,సినిమాలు మొదటీి నుంచి కలిసికట్టుగానే ప్రయాణం చేస్తున్నాయి. సినిమావాళ్ళు రాజకీయాల్లోకి రావటం, ప్రభుత్వాలపై కామెంట్స్ చేయటం కామన్ గా మారింది. అయితే పాజిటివ్ కామెంట్స్ వల్ల మహా అయితే పదవులు వస్తాయి. కానీ నెగిటివ్ కామెట్స్ వల్ల ఒక్కోసారి ఊహించని శత్రువులు ఏర్పడతారు. సినిమా వాళ్లకు అందరూ కావాలి ..కానీ ....కొందరే మిగులుతారు..ఇప్పుడు, రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ కి అదే జరుగుతోందా?
రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాకి తమిళ డైరక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా భారీ అంచనాల నడుమ గురువారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఒకే సమయంలో అమెరికా, ఇండియాలో విడుదల అవటం విశేషం. అయితే ఈ సినిమాకు ఊహించని స్దాయిలో ఓపినింగ్స్ రాలేదు. అందుకు రకరకాల కారణాలు బయిట వినపడుతున్నాయి. అందులో ఒకటి జగన్ అభిమానులు వ్యతిరికేంచటం అంటున్నారు. నిజా నిజాలు,సాధ్యాసాధ్యాలు ప్రక్కన పెడితే ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది...
వాస్తవానికి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే .. మరోవైపు గట్టిగా పోటీనిచ్చే సినిమా లేకపోవడంతో ‘ది వారియర్’ బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుకోవడం ఖాయమని ట్రేడ్ లో లెక్కలేసారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి నెంబరే జరిగినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ షేర్ బ్రేక్ ఈవెన్ ను రూ.44 కోట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో ఓపినింగ్స్ రాలేదు. అది ట్రేడ్ ని కంగారు పెట్టింది.
టిక్కెట్ రేట్లు తగ్గకపోవటం, భారీ వర్షాలు కారణంగా కొందరు చెప్తూంటే... వైయస్ జగన్ అభిమానులు ఈ సినిమాని కావాలనే చాలా చోట్ల బోయ్ కాట్ చేసారని కూడా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో రమేష్ హాస్పటిల్ ఇష్యూలో జగన్ అభిమానులు హర్ట్ అయ్యారని, అందుకే కావాలని సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాని బ్యాన్ చేద్దామని ఒకరికొకరు చెప్పుకుని సినిమాని ఎవాయిడ్ చేసారంటున్నారు.
అప్పట్లో హీరో రామ్ ఏపీ పోలీసులు, ప్రభుత్వం తీరు మీద విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రామ్ ఘాటుగా ట్వీట్లు చేశారు. అదే స్వర్ణప్యాలెస్‌ను రమేష్ ఆస్పత్రి తీసుకునేకంటే ముందే ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నడిపిందని, అప్పుడు ప్రమాదం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాన్ని వదిలేసి ఆస్పత్రి మీద అధిక ఫీజుల పేరుతో వేధిస్తున్నారని తప్పుపట్టారు. ఫైర్ ప్లస్ ఫీజు ఈజీక్వల్టూ ఫూల్స్ అంటూ అగ్నిప్రమాదాన్ని, ఫీజులను మిక్స్ చేసి జనాలను ఫూల్స్ చేస్తున్నారంటూ రామ్ ట్వీట్ చేశారు. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక నాని తాజా చిత్రం అంటే సుందరానికి సినిమా సమయంలో కూడా నానికి వ్యతిరేకంగా జగన్ అభిమానులు బాయ్ కాట్ చేసారని, అందుకే ఆ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఫెయిలైందని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎంతవరకూ నిజం ఉందనేది చూడాలి. సాధారణంగా బాగుందని టాక్ వస్తే బాయ్ కాట్స్ వంటివేమీ ఉండవు. జనాలు రాజకీయాలు, ప్రాంతాలుకు అతీతంగా వెళ్లి సినిమాలు చూస్తారనేది మాత్రం నిజం.
ఇక దర్శకుడు లింగుసామి ఓ సాదాసీదా పోలీస్ కథను ‘ది వారియర్’ మూవీకి ఎంచుకోవటం దెబ్బ తీసిందంటున్నారు. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కే ఏ సినిమాలోనైనా.. ఒకే ఫార్ములానే చాలా మంది దర్శకులు నమ్ముకుంటారు. ఇక్కడా అదే జరిగింది. ఒక ప్రాంతంలో దుర్మార్గమైన బలమైన విలన్. అతని ఆగడాలకు ప్రజలు విలవిలలాడిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ దుండుగుడి భరతం పట్టడమే అనే కాన్సెప్ట్ అంకుశం జమానా నుంచి నడుస్తోంది.
‘ది వారియర్’ మూవీకి కూడా అదే తరహా కథను రొటీన్ కథను ఎంచుకున్నాడు లింగుసామి. ఇలాంటి స్టోరీస్‌లో తర్వాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్‌కు తెలిసిపోవటమే మైనస్ అయ్యింది. ఇక లింగుసామి కూడా పోలీస్ కథకు కావాల్సిన ఒక ఫార్మాట్‌ను సెట్ చేసుకొని ఆ బరిలోనే ఈ సినిమాను అల్లుకున్నాడు. రొటీన్ స్టోరీ అయినా.. అక్కడడక్క దర్శకుడిగా తన మార్క్ చూపించాడు.
హీరో ముందుగా డాక్టర్‌గా చూపించాడు. ఒక వైద్యుడిగా రోగులకు ట్రీట్‌మెంట్ ఇవ్వవచ్చు. కానీ అదే పోలీస్ ఆఫీసర్ అయితే.. సమాజానికీ ట్రీట్మ్‌మెంట్ ఇవ్వవచ్చనే కాన్సెప్ట్‌తో డాక్టర్ నుంచి పోలీస్‌గా మారిన యువకుడి కథను తెరకెక్కించాడు.ఈ స్టోరీ తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ఏమంత ఎఫెక్ట్‌గా లేదు.
అలాగే స్క్రీన్ ప్లే పరంగానూ జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇంటర్వెల్ వరకు ముందుకు కదలదు. క్లైమాక్స్ సాదాసీదాగా ముగించడం అసంతృప్తికి గురి చేస్తోంది. దర్శకుడు ‘ది వారియర్’ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయకపోయినా.. స్క్రీన్ ప్లేతో ఆడుకుంటే బాగుండేది. ఎంతసేపు బీ, సీ, సెంటర్ ఆడియన్స్‌కు దృష్టిలో పెట్టుకొని ‘ది వారియర్’ మూవినీ ఊర మాస్గా తెరకెక్కించాలనే తాపత్రయం కనపడుతోంది.
అయితే ఈ చిత్రం టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఈ సినిమాకు సుజిత్ వాసుదేవ్ ఫోటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి .. ఇంటర్వెల్ కు ముందు ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక దేవీశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటల్లో హోలి సాంగ్‌తో పాటు, బుల్లెట్ సాంగ్ బాగున్నాయి. అవే ఉన్నంతలో సినిమాని నిలబెట్టాయి.
ఏదైమైనా రామ్ పోతినేని తొలిసారి ఈ సినిమాలో డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్ సత్యగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌గా అతని ఆహార్యం బాగుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్‌లో ఎంట్రీ మామూలుగా లేదు. . ఇక ఆది పినిశెట్టికి హీరోకు ఏ మాత్రం తక్కువ కాకుండా గురు పాత్రలో అదరగొట్టేసాడు. ఇవన్నీ చూడాలంటే థియేటర్ లో ఈ సినిమా చూస్తేనే బాగుంటుంది.