MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • దీపావళి ఆఫర్లు: రూ.64,990 ఏసీ కేవలం రూ.29,250 కే

దీపావళి ఆఫర్లు: రూ.64,990 ఏసీ కేవలం రూ.29,250 కే

Big Discounts on ACs : దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. చలికాలం ప్రారంభం కానుండటంతో 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపులు ప్రకటించారు. వోల్టాస్, ఎల్‌జీ, బ్లూ స్టార్ వంటి టాప్ బ్రాండ్లు ఆఫర్లు అందిస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 18 2025, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏసీలపై భారీ ఆఫర్లు
Image Credit : Pixabay

ఏసీలపై భారీ ఆఫర్లు

దీపావళి తో పాటు చలికాలం ప్రారంభం కానున్న క్రమంలో ఎయిర్ కండీషనర్ల (AC) ధరలు భారీగా తగ్గాయి. ఆన్‌లైన్ సేల్స్‌లో అనేక బ్రాండ్లు తమ 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. వేసవిలో ధరలు పెరగకముందే ఇప్పుడు కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపులు వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్‌జీ, డైకిన్, క్యారియర్ వంటి టాప్ బ్రాండ్లపై అమల్లో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వోల్టాస్ (Voltas) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
Image Credit : Pixabay

వోల్టాస్ (Voltas) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

వోల్టాస్ కంపెనీ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అసలు ధర ₹64,990. అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్‌లో కేవలం ₹29,250కి లభిస్తోంది.

ఈ ఏసీ 5 స్పీడ్ ఫ్యాన్ ఫంక్షన్ తో 4 విభిన్న మోడ్‌ ఫీచర్లను కలిగి ఉంది. గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా గదిని చల్లగా ఉంచుతుంది. ఒక సంవత్సరం వారంటీతో పాటు, 10 రోజుల బ్రాండ్ రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా అందిస్తున్నారు. ఇది 3 స్టార్ రేటింగ్ కలిగిన మోడల్.

36
ఎల్‌జీ (LG) 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
Image Credit : Pixabay

ఎల్‌జీ (LG) 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

ఎల్‌జీ కంపెనీ నుండి వచ్చిన ఈ 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలో కాపర్ కాయిల్ ఉంటుంది. అలాగే, 6 కన్వర్టబుల్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వేగంగా కూలింగ్ చేయడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

హెచ్‌డీ ఫిల్టర్ల సాయంతో గాలి ద్వారా వచ్చే వైరస్‌లను కూడా అడ్డుకుంటుంది. ఈ ఏసీ 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా గదిని చల్లగా ఉంచుతుందని కంపెనీ చెబుతోంది. దీని అసలు ధర ₹78,990 కాగా, ప్రస్తుతం ₹32,450కు పండగ సేల్ లో లభిస్తోంది.

46
బ్లూ స్టార్ (Blue Star) 1.5 టన్ వైఫై స్మార్ట్ ఏసీ
Image Credit : Istocks

బ్లూ స్టార్ (Blue Star) 1.5 టన్ వైఫై స్మార్ట్ ఏసీ

బ్లూ స్టార్ బ్రాండ్‌కు చెందిన ఈ 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ ఏసీ అసలు ధర ₹75,000 కాగా, ఇప్పుడు ఇది ₹39,970లకు సేల్ లో అందుబాటులో ఉంది. ఇది 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఏసీ పై 5 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. వైఫై సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ ఏసీని స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. అలాగే, వాయిస్ కమాండ్ టెక్నాలజీతో వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. గదిలో నాలుగు దిశలకూ గాలి సరఫరా చేసే ఫీచర్ ఇందులో ఉంది.

56
డైకిన్ (Daikin) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
Image Credit : Gemini

డైకిన్ (Daikin) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ

డైకిన్ బ్రాండ్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ అసలు ధర ₹67,200 కాగా, ప్రస్తుతం ఇది ₹40,490కి లభిస్తోంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఏసీ.. మొత్తం గదికి సమానమైన కూలింగ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది పీఎం 2.5 పార్టికల్స్‌ను అడ్డుకునే ఫిల్టరింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దీంతో గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. డైకిన్ ఏసీ 54 డిగ్రీల వేడిలో కూడా వేగంగా కూలింగ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

66
క్యారియర్ (Carrier) 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ ఏసీ
Image Credit : Gemini

క్యారియర్ (Carrier) 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ ఏసీ

క్యారియర్ 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ కూడా సగం ధరకే పండగ సేల్ లో అందుబాటులో ఉంది. ఇది 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. స్టెబిలైజర్ అవసరం లేకుండా ఇది నడుస్తుంది. ఈ ఏసీని మొబైల్ యాప్ ద్వారా లేదా వాయిస్ అసిస్టెంట్ సహాయంతో నియంత్రించవచ్చు. దీని అసలు ధర ₹62,000 కాగా, ప్రస్తుతం ఆన్‌లైన్ లో ₹31,490కు అందుబాటులో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
దీపావళి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Recommended image3
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Related Stories
Recommended image1
రూ. 21కే ఇయర్‌బడ్స్.. దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్ !
Recommended image2
దీపావళి ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ సునామీ : టాప్‌ 5 ప్రీమియం మొబైల్‌ డీల్స్‌ అస్సలు మిస్ కావొద్దు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved