MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Gadgets
  • దీపావళి ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ సునామీ : టాప్‌ 5 ప్రీమియం మొబైల్‌ డీల్స్‌ అస్సలు మిస్ కావొద్దు !

దీపావళి ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ సునామీ : టాప్‌ 5 ప్రీమియం మొబైల్‌ డీల్స్‌ అస్సలు మిస్ కావొద్దు !

Flipkart Diwali sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వివో ఎక్స్200 ఎఫ్ఈ సహా పలు మొబైల్స్ పై సూపర్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దీపావళి ఆఫర్లు: సూపర్ డీల్స్ ఇవి
Image Credit : Getty

దీపావళి ఆఫర్లు: సూపర్ డీల్స్ ఇవి

దీపావళి పండుగకు ముందు ఫ్లిప్‌కార్ట్ భారీ ఫెస్టివ్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వివో X200 FE వంటి ఫ్లాగ్‌షిప్‌ మోడళ్ల ధరలు తగ్గించారు. అలాగే, కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ క్రెడిట్‌ కార్డులతో అదనపు తగ్గింపులు పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐఫోన్ 16 (128GB) పై భారీ తగ్గింపు
Image Credit : Getty

ఐఫోన్ 16 (128GB) పై భారీ తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 (iPhone 16 128GB) ఇప్పుడు ₹57,999కి లభిస్తోంది. అసలు ధర ₹69,900గా ఉంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా అదనంగా ₹3,000 తగ్గింపు, అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌గా ₹48,990 వరకు లభిస్తుంది.

ఐఫోన్‌ 16లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌, iOS ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, ఆటోఫోకస్ ఉన్న అల్ట్రా వైడ్ లెన్స్, 2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. A18 చిప్‌తో వచ్చే ఈ ఫోన్‌ ఫోటో, వీడియో, గేమింగ్‌లో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

36
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256GB) పై టాప్ ప్రీమియం ఆఫర్
Image Credit : Getty

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256GB) పై టాప్ ప్రీమియం ఆఫర్

ప్రీమియం కేటగిరీలో అత్యధిక డిమాండ్‌ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max 256GB) ఇప్పుడు ₹1,14,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,34,900. ఈ తగ్గింపుతో పాటు యాక్సిస్ బ్యాంకు కార్డ్ వినియోగదారులకు అదనంగా ₹4,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే, ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ₹61,900 వరకు అందుబాటులో ఉంది.

టైటానియం ఫ్రేమ్‌, సెరామిక్ షీల్డ్‌ ఫ్రంట్‌, మ్యాట్‌ గ్లాస్‌ బ్యాక్‌తో ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. వాటిలో బ్లాక్‌, వైట్‌, నేచురల్‌, డెజర్ట్‌ కలర్స్ ఉన్నాయి.

6.9 అంగుళాల సూపర్ రెటినా (Super Retina XDR OLED) డిస్‌ప్లే 120Hz ప్రో మోషన్, HDR, Always-On ఫీచర్‌లతో వస్తుంది. A18 Pro చిప్‌ సెట్ ను కలిగి ఉంది. ఈ మోడల్‌లో 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రా వైడ్‌, 5x టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 4కే డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌, వైఫై 7, స్పేషియల్ ఆడియో, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

46
శాంసంగ్ ఎస్ 25 ఎడ్జ్ 5జీ పై ఫ్లాగ్‌షిప్ ఆఫర్
Image Credit : our own

శాంసంగ్ ఎస్ 25 ఎడ్జ్ 5జీ పై ఫ్లాగ్‌షిప్ ఆఫర్

శాంసంగ్ గెలక్సీ ఎస్ 25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge 5G) ప్రస్తుతం ₹89,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,09,999. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు తో కోనుగోలు చేస్తే ₹4,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹83,780 వరకు ఉంది. ఈ ఫోన్‌లో 6.65 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరా విభాగంలో 200MP మెయిన్‌, 12MP సెకండరీ, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 3900mAh బ్యాటరీ, గెలాక్సీ ఏఐ, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఐపీ68 రేటింగ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

56
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా పై కూడా ధర తగ్గింపు
Image Credit : Samsung

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా పై కూడా ధర తగ్గింపు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా (alaxy S25 Ultra 5G) ఇప్పుడు ₹1,04,727కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,29,999. యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ₹4,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹61,900 వరకు ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.85 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 పై నడుస్తుంది. 200MP, 50MP, 50MP, 10MP కెమెరా సెన్సర్లు, 5000mAh బ్యాటరీ, ఎస్ పెన్ సపోర్ట్‌, గెలాక్సీ ఏఐ, ఐపీ 68 సర్టిఫికేషన్‌, ఆడియో ఇరేసర్ టూల్‌ ఈ మోడల్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

66
వివో ఎక్స్ 200 ఎఫ్ఈ 5జీ పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్ ఫోన్
Image Credit : Vivo Website

వివో ఎక్స్ 200 ఎఫ్ఈ 5జీ పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్ ఫోన్

వివో ఎక్స్ 200 ఎఫ్ఈ (Vivo X200 FE 5G) ఇప్పుడు ₹59,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹64,999. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ₹4,000 తగ్గింపును కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹50,490 వరకు ఉంది.

ఈ ఫోన్‌ 6.31 అంగుళాల AMOLED 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 పై నడుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. కెమెరా విభాగంలో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెట్‌ప్‌, 6500mAh బ్యాటరీ, 90W ఫ్లాష్‌చార్జ్‌, జైసిస్ ఇమేజింగ్‌, ఐపీ 68/69 రేటింగ్‌, ఐఏ ఇమేజ్ స్టూడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీపావళి సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మంచి డీల్స్ గా ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్లు, ఎక్స్చేంజ్‌ బెనిఫిట్స్‌తో పాటు తగ్గింపులు అందుబాటులో ఉండటం కొనుగోలును మరింత లాభదాయకం అని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఇ-కామర్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Smart TV: రూ. 15 వేల‌కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Related Stories
Recommended image1
దీపావళి ఆఫర్‌: 7000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా ఫోన్ పై రూ.6000 తగ్గింపు
Recommended image2
దీపావళి సేల్‌: బంపర్ ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌పై 44% తగ్గింపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved