MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Football
  • FIFA: వరల్డ్ కప్ గెలిచాం.. ఛాంపియన్ టీమ్ మెంబర్‌గా ఉండొద్దా..? రిటైర్మెంట్‌పై మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

FIFA: వరల్డ్ కప్ గెలిచాం.. ఛాంపియన్ టీమ్ మెంబర్‌గా ఉండొద్దా..? రిటైర్మెంట్‌పై మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

FIFA World Cup 2022:  36 ఏండ్ల  తర్వాత  అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. లియోనల్ మెస్సీ సారథ్యంలోని  ఆ జట్టు   ఆదివారం  రాత్రి ముగిసిన ఫైనల్స్ లో  ఓడించి  విశ్వవిజేతగా అవతరించింది.  

2 Min read
Author : Srinivas M
Published : Dec 19 2022, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తన దేశానికి ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుని టోర్నీలోకి అడుగుపెట్టిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అనుకున్నది సాధించాడు.  టోర్నీలో తొలి మ్యాచ్ లో  సౌదీ అరేబియా చేతిలో ఓడినా  ఆ తర్వాత   ఒక్కో  మెట్టు ఎక్కుతూ  ఫైనల్ లో  2018లో ఛాంపియన్ అయిన  ఫ్రాన్స్ ను  పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే 35 ఏండ్ల మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్.   వచ్చే వరల్డ్ కప్ (2026) నాటికి మెస్సీ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలో   కొద్దిరోజుల ముందే ఇదే నా చివరి ప్రపంచకప్ అని.. ఈ వరల్డ్ కప్ లో సాధించి తీరుతానని మెస్సీ కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 

36

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో    ప్రపంచకప్ తర్వాత మెస్సీ  రిటైర్ అవుతాడని..  ఫైనల్ లో తన దేశాన్ని విశ్వవిజేతగా నిలిపి  ఆ  తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వెలువడ్డాయి.  ఫైనల్ ముగిసిన నేపథ్యంలో విలేకరులు కూడా  మెస్సీని ఇదే ప్రశ్న అడిగారు.  అయితే అలాంటిదేమీ లేదన్నాడు మెస్సీ.  

46

మెస్సీ మాట్లాడుతూ.. ‘నాకు మాటలు రావడం లేదు.  ఇదంతా కలలా ఉంది.  ఆ దేవుడు నాకు  ఈ ట్రోఫీని ఇస్తాడని  తెలుసు.  నా దేశానికి  ప్రపంచకప్ అందించాలనేది నా కల. నా కెరీర్ ను  ప్రపంచకప్ సాధించి ముగించాలనుకున్నా. ఇంతకుమించి  దేవుడిని నేను మరేది అడగలేదు.. 

56

అయితే ఈ మ్యాచ్ తర్వాత  నేను రిటైర్ అవుతానని  అంటున్నారు. లేదు. నేను రిటైర్ కావడంలేదు. మేం వరల్డ్ కప్ గెలిచాం. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అయ్యాం.  ఆ ఫీలింగ్ ను నేను ఆస్వాదించొద్దా..  అర్జెంటీనా జెర్సీ మరికొన్నిరోజులు ధరించి వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఆడాలని ఫిక్స్ అయ్యా..’అని స్పష్టం చేశాడు. 

66

ఇక మెస్సీ రిటైర్మెంట్ అంశంపై  అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనల్ స్కాలోని స్పందిస్తూ.. ‘వచ్చే వరల్డ్ కప్ లో మెస్సీ  ఆడాలనుకుంటే అతడికి తప్పకుండా ప్లేస్ ఉంటుంది.  మేం అతడిని వదులుకోం. అతడు ఆడినన్ని రోజులు నెంబర్  10 (మెస్సీ జెర్సీ) అతడిదే..’ అని చెప్పడం గమనార్హం. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved