విడాకుల కేసులో సగం ఆస్తి కావాలని డిమాండ్ చేసిన భార్యకి షాక్... ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకిమి చేసిన పనికి...
ఓ టీనేజ్ కుర్రాడిని వలపు వలలో పడేసిన మూడు పదుల హీరోయిన్, ఐదేళ్ల కాపురం తర్వాత అతన్ని వదిలించుకోవాలనుకుంది. విడాకులు ఇచ్చేసి భరణంగా సగం ఆస్తి కాజేయాలనుకుంది. అయితే అతని తెలివి కారణంగా ఆమెకి ఊహించని షాక్ తగిలింది. ఇది సాధారణ వ్యక్తి జీవితంలో జరిగింది కాదు, మొరాకో ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకిమి వైవాహిక జీవితంలోది..
Kylian Mbappe-Achraf Hakimi
ఓ పురుషుడు జీవితంలో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో వదులుకోవాలి. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి. అయినా సక్సెస్ వస్తుందని చెప్పలేం. అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టపడినా వేస్టే. అదే ఓ మహిళ సక్సెస్ కావాలంటే, బాగా సెటిల్ అయిన వాడిని చేసుకుంటే చాలు.. పురుషాధిక్య స్టేట్‌మెంట్‌లా అనిపిస్తున్నా ఇదే నిజం.
Kylian Mbappe-Achraf Hakimi
చాలామంది సెలబ్రిటీల భార్యలు చేసింది, చేస్తుంది ఇదే. ప్రపంచ కుభేరుడిగా పేరొందిన బిల్ గేట్స్ కూడా పెళ్లైన 27 ఏళ్లకు భార్యకు విడాకులు ఇచ్చి, భరణంగా సగం ఆస్తి ముట్టచెప్పాడు. టామ్ క్రూజ్, జానీ డెప్ వంటి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విడాకుల కారణంగా సగం ఆస్తిని కోల్పోయారు..
అయితే పెళ్లయ్యాక, భార్య పోరు పడలేక విడాకులు తీసుకోవాల్సి వస్తే... పైసా పైసా కూడబెడుతూ సంపాదించిన కోట్ల ఆస్తి పోతుందని ముందుగానే ఆలోచించాడో ఏమో కానీ మొరాకో ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకిమి... ముందుజాగ్రత్తగా చేసిన పని, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..
వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో ఒకడైన అచ్రాఫ్ హకిమి, హిబా అబోక్ అనే స్పానిష్ నటి, మోడల్‌ని ప్రేమించి, కొన్నాళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పెద్ద కొడుకు వయసు 3 ఏళ్లు కాగా, చిన్న కొడుకు గత ఏడాదే జన్మించాడు..
అయితే కొన్నాళ్ల కిందట అచ్రాఫ్ హకిమిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ కేసు కోర్టులో విచారణలో ఉండగానే ఆయన భార్య హిబా అబోక్, విడాకుల కోసం అప్పీలు చేసింది...
అంతేకాదు, తనకు భరణంగా భర్త అచ్రాఫ్ హకిమి కోట్ల విలువైన ఆస్తిలో సగ భాగం కావాలని డిమాండ్ చేసింది. ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకిమి కూడా భార్య డిమాండ్‌కి అంగీకరించాడు. కావాలంటే తన ఆస్తి మొత్తం తనకే ఇవ్వాలని తెలిపాడు. అయితే అచ్రాఫ్ హకిమి పేరిట ఉన్న ఆస్తుల విలువ తేల్చిన కోర్టుకి షాక్ తగిలింది..
పారిస్ సెయింట్ జెర్మన్, రియల్ మాడ్రిడ్ వంటి టీమ్స్‌కి ఆడిన అచ్రాఫ్ హకిమి, తన కెరీర్‌లో సాధించిన విజయాలు, బ్రాండ్ అంబాసిడర్స్, స్పాన్సర్స్, ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన మొత్తాన్ని పూర్తిగా తన తల్లికే ఇచ్చేశాడు..
అంతేకాదు అతను కొన్న భవనాలు, ఇళ్లు, స్థలాలు అన్నీ కూడా తల్లి పేరిటే రిజిస్టర్ చేశాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం, అతని తల్లి ఫాతిమా అకౌంట్‌లోనే డిపాజిట్ చేశాడు..
Achraf Hakimi
దీంతో అచ్రాఫ్ హకిమి పేరిట ఒక్క సెంటు భూమి కానీ, కారు కానీ ఆఖరికి సొంత బట్టలు కూడా లేవని కోర్టు విచారణలో తేలింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అచ్రాఫ్ హకిమికి 19 ఏళ్లు ఉన్నప్పుడే, 31 ఏళ్ల హిబా అబోక్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టాడు..
Image Credit: Getty Images
ఇప్పుడు హిబా అబోక్ వయసు 36 ఏళ్లు కాగా అచ్రాఫ్ హకిమి వయసు 24 ఏళ్లే. అచ్రాఫ్ హకిమి తన తల్లి పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటాయి. దీంతో అచ్రాఫ్ హకిమిని వదిలించుకోవాలని చూసిన హిబా అబోక్‌కి చట్టపరంగా ఒక్క రూపాయి కూడా దక్కదు..