MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • భోజనం తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుందా..? కారణం ఇదే ..!

భోజనం తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుందా..? కారణం ఇదే ..!

భరించలేని నొప్పి కారణంగా చాలా మంది భోజనం చేయడానికి కూడా ఆసక్తి చూపించరు. అసలు ఇలా రావడానికి కారణం ఏంటి..? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో చూద్దాం....

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2024, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కచ్చితంగా మూడు పూటలా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందులో పుష్కలంగా ఉంటాయి. ఆ పోషకాలు మనకు అందాలి అంటే.... కచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే.  ఆహారమే మనకు కావాల్సిన బలాన్ని కూడా అందిస్తుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. కానీ.. చాలా మందికి భోజనం చేసిన వెంటనే కడుపులో నొప్పి వస్తుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భరించలేని నొప్పి కారణంగా చాలా మంది భోజనం చేయడానికి కూడా ఆసక్తి చూపించరు. అసలు ఇలా రావడానికి కారణం ఏంటి..? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో చూద్దాం....
 

35
stomach pain

stomach pain

భోజనం చేసిన వెంటనే కడుపులో నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే... మీరు విషపూరితమైన ఆహారం లేదంటే.... క్రిములు కీటకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు.  పాడైన ఆహారం తిన్నా కూడా  వెంటనే ఇలా కడుపులో నొప్పి వస్తుంది. ఆహారం సరిగా ఉడకని సమయంలో కూడా ఇలా నొప్పి వస్తుంది. ఇలా అయ్యింది అంటే... మీకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని అర్థం. దీని వల్ల కడుపులో నొప్పి రావడంతో పాటు... వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా వస్తాయి. 

45
stomach pain

stomach pain


కొందరు ఆహారం చాలా ఎక్కువగా తిన్నప్పుడు కూడా కడుపులో నొప్పి రావడానికి కారణం అవుతుంది.  అతిగా తినడం వల్ల పొట్ట దాని సహజ సామర్థ్యానికి మించి విస్తరిస్తుంది. ఇది నొప్పి, గ్యాస్, అసౌకర్యం , వాపు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత కడుపులో నొప్పి వస్తే మీకు పెప్టిక్ అల్సర్ ఉందని అర్థం. మీరు నొప్పితో పాటు బర్నింగ్ అనుభూతిని అనుభవిస్తే, మీరు కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

55

కొందరికి ఫుడ్ ఎలర్జీలు ఉంటాయి. కొందరికి కొన్ని ఆహారాలు అసలు పడవు. దాని వల్ల కూడా  ఆహారం తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ లాక్టోస్ అసహనం, ఇది పాల ఉత్పత్తుల వినియోగం వల్ల సంభవిస్తుంది. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పిని అనుభవిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved