వీళ్లు మాత్రం బాదం పప్పులను తినకూడదు
మన ఆరోగ్యానికి మేలు చేసే గింజల్లో బాదం పప్పులు ఒకటి. బాదం పప్పుల్లో ఉండే రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని హెల్తీగా ఉంచుతాయి. కానీ కొంతమంది పొరపాటున కూడా బాదం పప్పులను తినకూడదు. వాళ్లు ఎవరంటే?
నట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. నట్స్ లో ఒకటైన బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని పుష్కలంగా తింటుంటారు. చాలా మంది వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటుంటారు.
almonds
నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బాదం పప్పుల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి.
వీటిని రోజూ కొన్ని తింటే జుట్టు, గోర్లు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం బాదం పప్పులు హాని చేస్తాయి. అవును బాదం పప్పులు కొంతమందికి అస్సలు మంచివి కావు. ఒకవేళ తిన్నారంటే సమస్యలను ఎదుర్కోవాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అధిక రక్తపోటు ఉన్నవారికి..
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అయితే మీరు కూడా హైబీపీ పేషెంట్ అయితే మాత్రం బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్.
soaked almonds
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారికి..
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్య వల్ల భరించలేని నొప్పి వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రపిండాల రాళ్లు లేదా పిత్తాశయ రాళ్లు ఉన్నవారు బాదం పప్పులను తినకూడదు. ఎందుకంటే దీనిలో బాదం పప్పుల్లో ఉండే ఆక్సలేట్ కిడ్నీ రాళ్లను మరింత పెంచుతుంది. కాబట్టి తినకూడదు.
జీర్ణ సమస్యలు పెరుగుతాయి
జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా బాదం పప్పులను తినకూడదు. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు బాదం పప్పులను అస్సలు తినకూడదు. ఎందుకంటే బాదం పప్పులు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి దీనివల్ల జీర్ణ సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి వీళ్లు కూడా తినకూడదు.
ఊబకాయం పెరుగుతుంది
చాలా మంది బరువు తగ్గడానికి ఉదయాన్నే బాదం పప్పులను తింటుంటారు. కానీ ఊబకాయంతో బాధపడేవారు బాదం పప్పులను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే కేలరీలు, కొవ్వు మీ బరువును మరింత పెంచుతాయి. కాబట్టి ఎక్కువగా తినకూడదు.
మైగ్రేన్ ఉన్నవారు
మైగ్రేన్ సమస్య ఉన్నవారు బాదం పప్పులను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో విటమిన్-ఇ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది తలనొప్పి, మైకము, అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది.అందుకే దీన్ని ఎక్కువగా తినకూడదని చెప్తారు.
దగ్గు-జలుబు
చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు బాదం తినకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఈ సమస్యలను మరింత పెంచుతుంది.
అలర్జీలు పెరుగుతాయి
అలెర్జీ ఉన్నవారు కూడా బాదం పప్పులను తినడం మానుకోవాలి. ఇది అలెర్జీల సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. అయితే బాదం పప్పులను తినడం గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ తక్కువ మొత్తంలో తినాలి.