అంబానీ ఫ్యామిలీ తాగే ఈ పాలు ఎంత స్పెషలో తెలుసా?
కుటుంబంలో అందరూ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలా, సమతుల్య ఆహారం తీసుకుంటారు. పాలు కూడా.. మనలా కాకుండా చాలా స్పెషల్ పాలు తాగుతారట. ఆ పాల వివరాలు ఇప్పుడు చూద్దాం..
అంబానీ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా ముకేష్ అందరికీ పరిచయమే. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లితో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈ పెళ్లిలో... నీతా అంబానీ, ఇషా అంబానీ ధరించే దుస్తులు, వాటి ధరలు, లైఫ్ స్టైల్ విషయాలు బయటకు వస్తున్నాయి.
తాజాగా.. అంబానీ ఫ్యామిలీ తాగే పాలకు సంబంధించిన విషయం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మామూలుగానే... ముకేష్- నీతా అంబానీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలో అందరూ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలా, సమతుల్య ఆహారం తీసుకుంటారు. పాలు కూడా.. మనలా కాకుండా చాలా స్పెషల్ పాలు తాగుతారట. ఆ పాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మీడియా సమాచారం ప్రకారం.. ముకేష్ అంబానీ కుటుంబం రోజూ పూణే నుంచి స్పెషల్ గా పాలు తెప్పించుకుంటారట. పూణే నుంచి వచ్చిన హోల్ స్టెయిన్- ఫ్రీసియన్ అనే ప్రత్యేకమైన విదేశీ జాతికి చెందిన ఆవు పాలు తాగుతారట.
సాధారణంగానే పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలలు తాగడం వల్ల... ఎముకలు బలంగా మారతాయి. దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఓవరాల్ గా మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరి... ఈ స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాల వల్ల.. స్పెషల్ గా ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలుసుకుందాం..
స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలు సాధారణంగానే.. మామూలు ఆవులకంటే పాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయట. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయట.
పూణేలో స్పెషల్ హైటెక్ లెవల్ లో 35 ఎకరాల్లో ఈ పాలతో ఓ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అంబానీ ఫ్యామిలీకి పాలు చేరతాయి. ఈ ఆవులు.. మామూలు వాటర్ తాగవు. ఆర్ఓ వాటర్ మాత్రమే తాగుతాయట. అవి తినే ఫుడ్ కూడా చాలా స్పెషలే. అందుకే.. వీటి పాలు కూడా సాధారణంగా ఉండవు. ఒక్కో ఆవు రోజుకి కనీసం 25 లీటర్ల పాలు ఇవ్వగలదట.
అంబానీ కుటుంబంతో పాటు సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీస్ కూడా ఇవే పాలను వాడతారట. వీటి ధర కూడా.. ఎక్కువగా ఉంటుందని సమాచారం.