MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • నెల రోజుల పాటు నూనె లేని ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా?

నెల రోజుల పాటు నూనె లేని ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా?

మన దేశంలో చాలా మంది ఆయిలీ ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఆయిలీ ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక నెల రోజుల పాటు నూనె లేని ఆహారాలను తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 23 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇండియాలో ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏదో ఒక ఆయిలీ ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. పూరీ, పకోడి, మిర్చి బజ్జీ, సమోసా, పునుగులు వంటివినూనెతోనే తయారవుతాయి. అయితే ఆహారంలో నూనె లేకపోతే  ఫుడ్ టేస్టీగా ఉండదని చెప్తారు. కానీ ఈ నూనె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.ఇలాంటి పరిస్థితిలో నెల రోజుల పాటు నూనె లేని ఆహారాలను తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆరోగ్య నిపుణులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆయిల్ ఫుడ్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుంటే శరీరంపై మంచి ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయిలీ ఫుడ్ ను తీసుకోవడం మానేసినప్పుడు మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే తక్కువ నూనెతో తయారైన ఆహారాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

35

నూనె లేని ఆహారాలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఫుడ్ లో ఆయిల్ ను తొలగించడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది గుండె పనితీరును మునుపటి కంటే మెరుగ్గా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పుకూడా చాలా వరకు తగ్గుతుంది.ఇది బీపీని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది.

45

మీరు ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉన్నప్పుడు.. మీరు బరువు కూడా తగ్గుతారు. ఆహారం నుంచి కొవ్వును తగ్గించడం వల్ల కేలరీలు తీసుకోవడం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల మీరు ఒకనెలలోనే కొన్ని కిలోల బరువు తగ్గుతారు. అంతేకాదు మీరు  ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల మీరు మరింత శక్తివంతంగా తయారవుతారు. 

55
skin care

skin care

ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల మీ చర్మం మునుపటి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది. దీనివల్ల మీ చర్మం శుభ్రంగా, క్లియర్ గా కనిపిస్తుంది. శరీరానికి కొవ్వు కూడా అవసరం. అందుకే నెయ్యి లేదా నూనెను ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ పరిమితిలోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?
Recommended image2
Sweet Corn Vs Native Corn : విదేశీ స్వీట్ కార్న్, స్వదేశీ మొక్కజొన్నల్లో ఏది బెస్ట్ ఫుడ్? దేంట్లో బలం ఎక్కువ?
Recommended image3
డిన్నర్ చేశాక పాత్ర‌ల‌ను క‌డ‌గ‌కుండా.. రాత్రంతా సింక్‌లో అలాగే వ‌దిలేస్తున్నారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved