MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • గోరుచిక్కుడు తింటే ఏమౌతుందో తెలుసా?

గోరుచిక్కుడు తింటే ఏమౌతుందో తెలుసా?

గోరుచిక్కుడును గోకరికాయ అని కూడా ఉంటారు. అయితే చాలా మంది దీన్ని గుడ్డుతో వండి ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ కూరగాయను తినడం వల్ల ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 19 2024, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గోరుచిక్కుడు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలోనే ఎక్కువగా తింటుంటారు. గ్రీన్ బీన్స్ వంటి ఈ కూరగాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? ముఖ్యంగా గోకరికాయ ఆడవారి ఆరోగ్యానికి ఒక వరంలా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో ఇనుము లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. అసలు ఈ గోకరికాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


బరువు తగ్గుతారు

బరువు తగ్గాలనుకునేవారికి గోరుచిక్కుడు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును గోరుచిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ కడుపును తొందరగా నింపి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

36

రక్తహీనత నివారణ

గోరుచిక్కుడు కాయల్లో  ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో రక్తానికి కొదవ ఉండదు. ఈ కూరగాయను తింటే మీ ఒంట్లో రక్తం బాగా పెరుగుతుంది. 
 

46

ప్రెగ్నెన్సీ లకు ప్రయోజనకరం

గోరుచిక్కుడు ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గోరుచిక్కుడులో ఉండే ఐరన్, కాల్షియం గర్భిణీ స్త్రీలలో మినరల్స్ లోపాన్ని తీర్చడానికి సహాయపడతాయి. ఈ కూరగాయలో ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో పిండాన్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంది. గోరుచిక్కుడులో ఉండే విటమిన్ కె మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది పిల్లలు బాగా ఎదగడానికి సహాయపడుతుంది.
 

56

రక్తపోటు నియంత్రణ

గోరుచిక్కుడులో హైపోగ్లైసీమిక్,  హైపోలిపిడెమిక్ లక్షణాలు ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.  డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు గోరుచిక్కుడు తింటే రక్తపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది. 
 

66

బలహీనత

ఆడవాళ్లలోనే ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో తరచుగా నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు గోరుచిక్కుడు తింటే బలహీనత తొలగిపోతుంది. అలాగే మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. గోరుచిక్కుడు రక్త లోపాన్ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది ఆడవారికి బలాన్ని కూడా ఇస్తుంది. 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved