ఈ ఐస్ క్రీములు తిన్నా.. బరువు పెరగరు తెలుసా?
మళ్లీ ఎక్కడ లావు అయిపోతామేమో అనే భయంతో చాలా మంది ఐస్ క్రీమ్ తినలేరు. అయితే.. ఇప్పుడు ఆ బాధ అక్కర్లేదు. ఎందుకంటే.. డైట్ లో ఉన్నవారు కూడా తినగలిగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి
ఐస్ క్రీమ్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..? అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ.. పాపం డైట్ లో ఉన్నవారి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే.. తినాలనే కోరిక ఉన్నా.. మళ్లీ ఎక్కడ లావు అయిపోతామేమో అనే భయంతో చాలా మంది ఐస్ క్రీమ్ తినలేరు. అయితే.. ఇప్పుడు ఆ బాధ అక్కర్లేదు. ఎందుకంటే.. డైట్ లో ఉన్నవారు కూడా తినగలిగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. వీటిలో 100 క్యాలరీలకన్నా తక్కువగానే ఉంటుంది. మరి ఆ ఐస్ క్రీమ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
acai berry
1.క్రీమీ బెర్రీ ఐస్ క్రీమ్..
ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం చాలా సులువు. దీని తయారీకి 2 కప్పుల తక్కువ కొవ్వు ఉన్న క్రీమ్ లేదా హంగ్ పెరుగు తీసుకోవాలి. తర్వాత మరో కప్పు బెర్రీలు తీసుకోవాలి. తర్వాత వాటిలో నుంచి సీడ్స్ తొలగించాలి. సీడ్స్ తొలగించిన బెర్రీలకు మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. తర్వాత వీటిని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత మరో పెద్ద గిన్నె తీసుకొని క్రీమ్ ను, ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. దీనిలో పేస్టులా చేసిన బెర్రీ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వీటిని ఐస్ క్రీమ్ క్యూబ్ లో వేసి దాదాపు 6 నుంచి 8గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత.. దీనిని సర్వ్ చేసుకొని తినేయడమే. దీనిలో 98 కేలరీలు మాత్రమే ఉంటాయి. బరువు పెరుగుతామనే భయం ఉండదు.
2.మ్యాంగో గ్రీన్ టీ ఐస్ క్రీమ్..
దీనిని కచ్చితంగా ఐస్ క్రీమ్ ప్రియులు తప్పక ప్రయత్నించాలి. దీనిని కూడా తయారు చేయడం చాలా సులభం. రెండు మూడు టీ బ్యాగ్‌లను ఉపయోగించి సాధారణ గ్రీన్ టీని సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో పోసి, గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత, 1 కప్పు మామిడి ప్యూరీ, పుదీనా ఆకులు, యాలకుల పొడి వేసి, అన్నింటినీ కలిపి పాప్సికల్ మౌల్డ్‌లలో పోసి 7 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వీటిని ఆస్వాదించవచ్చు.ఈ ఐస్‌క్రీమ్‌లో మొత్తం 97 కేలరీలు ఉంటాయి.
3.కాఫీ బాదం ఐస్ క్రీమ్..
ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం కూడా చాలా సులువు. దీనిని తయారు చేయడానికి రెండు కప్పుల బాదం పాలు తీసుకోండి. దీనిని మీడియం మంటపై పెట్టి మరిగించాలి. తర్వాత అందులో రెండు స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ కాఫీ ని కలపాలి. తర్వాత దానిని బాగా చల్లారనివ్వాలి. బాగా కలిపి.. ఐస్ క్రీమ్ ట్రేలో పోసి... 5గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత.. మళ్లీ బయటపెట్టి.. కలిపి.. ఆ తర్వాత.. వేయించిన బాదం పప్పులు వేసి 3-4 గంటలు మళ్లీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
4.లెమన్ ఐస్ క్రీమ్...
ఐస్‌క్రీమ్‌లు ఎప్పుడూ క్రీమీగా ఉండవు, మీరు పాప్సికల్స్‌ను ఇష్టపడేవారైతే, ఈ స్వీట్ ఐస్‌క్రీం తప్పకుండా మీ హృదయాన్ని గెలుచుకుంటుంది. ఒక పెద్ద గిన్నె లేదా కూజా నీటిని తీసుకుని, ¼ కప్పు నిమ్మరసం, ¼ కప్పు అల్లం రసం, 2 టేబుల్ స్పూన్ల తేనె పోసి, అన్నింటినీ బాగా కలపండి. దీన్ని బేకింగ్ ట్రేలో పోసి 3 గంటలు ఫ్రీజ్ చేసి, బయటకు తీసి నిమ్మతొక్కలో వేసి, యాపిల్ బిట్స్ వేసి మరింత రుచికరంగా మార్చాలి. తర్వాత 3-4 గంటలు బాగా ఫ్రీజ్ చేసి ఆనందించండి. దాదాపు 89 కేలరీలతో, ఈ సాధారణ ఐస్ క్రీం కేవలం రుచికరమైనది కాదు, హైడ్రేటింగ్‌గా ఉంటుంది.