ఈ టీ ఎంత కాస్ట్లీనో.. కప్పు రూ.వెయ్యి..!
వివిధ ప్రాంతాల నుంచి వెళ్లి మరీ అక్కడ టీ ఎగబడి తాగుతున్నారంటే.. అందులో ఉన్న ప్రత్యేతక ఏంటో మనమూ ఓ సారి తెలుసుకుందాం..

సాధారణంగా టీ ఖరీదు ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.10 ఉంటుంది. లేదు కాదు.. అంటే మరో రూ.20 ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. అయితే... ఓ హోటల్ లో మాత్రం కేవలం కప్పు టీ అక్షరాల వెయ్యి రూపాయలు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.

అంత ఖరీదైన టీ తాగడానికి కూడా జనాలు విపరీతంగా క్యూలు కడుతుండటం గమనార్హం. ఇది మరెక్కడో కాదు.. కోల్ కతాలో. వివిధ ప్రాంతాల నుంచి వెళ్లి మరీ అక్కడ టీ ఎగబడి తాగుతున్నారంటే.. అందులో ఉన్న ప్రత్యేతక ఏంటో మనమూ ఓ సారి తెలుసుకుందాం..

రోజువారీ ఉద్యోగ జీవితంతో విసుగు చెందిన బంగాల్‌కు చెందిన పార్థ గంగూలీ.. ఎదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. తన స్నేహితులతో సైతం ఆ అంశంపైనే చర్చిస్తుండేవారు. మిత్రుల సలహా మేరకు.. రకరకాల టీలను విక్రయించాలని నిర్ణయించారు. 2014 లో ముకుందపూర్ లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు సమీపంలో నిర్జాస్ అనే టీ దుకాణం ప్రారంభించారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన టీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్తున్నారు గంగూలీ. ఇక్కడ తయారు చేసే రకరకాల టీ ల కోసం స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.

టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అని నమ్మే గంగూలీ... రాబోయే రోజుల్లో టీతో థెరపీని ప్రారంభిస్తాను అని అంటున్నారు. ఇది కూడా త్వరలోనే ప్రారంభించాలని అతను ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం.

గంగూలీ ప్రారంభించిన దుకాణంలో దాదాపు అన్ని రకాల టీలు దొరుకుతాయి. గ్రీన్ ఛాయ్, అల్లం ఛాయ్, ఇలాచీ టీ, లవంగాలతో చేసిన తేనీరుతో అనేక రకాలు ఇక్కడ లభ్యమవుతాయి. సీజన్ల వారీగా టీ అమ్మడం ఇక్కడ ప్రత్యేకత. పార్థ గంగూలీ ఒక్క కప్పు టీని రూ. 15 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు.

గంగూలీ అనే వ్యక్తి ఈ టీ దుకాణాన్ని 2014లో ప్రారంభించారు. దాదాపుగా 100 రకాల తేనీరు అక్కడ దొరుకుతుంది. టీ రకాన్ని బట్టి ఖరీదు ఉంటుంది. రూ.15 మొదలు వెయ్యి వరకు టీ ధరలు ఉంటాయి.

వంద రకాల టీలలో కూడా మస్కటెల్ టీ అనే సుగంధితో తయారు చేసే టీ ఫేమస్ అయ్యింది. ఆ టీ కోసమే అక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో మస్కటెల్ టీని సేవించేందుకు వస్తుంటారట.