MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను ఖచ్చితంగా తినండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను ఖచ్చితంగా తినండి

కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మనల్ని బరువు పెరగకుండా కాపాడుతాయి. అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2023, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
weight loss

weight loss

ఊబకాయం ప్రస్తుతతం చాలా మందిని వేధిస్తున్న సర్వసాధారణ సమస్య. మీకు తెలుసా? కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. అయితే కేలరీలు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. మనం తినే ప్రతిదానిలో కేలరీలు ఉంటాయి. అయితే ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే  మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి కేలరీలు తక్కువగా ఉండే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బెర్రీలు

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, కోరిందకాయలు వంటి అర కప్పు బెర్రీల్లో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 
 

36
Image: Getty Images

Image: Getty Images

ఆపిల్స్

100 గ్రాముల ఆపిల్స్ లో 50 కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో పెక్టిన్ చాలా ఉంటుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా  సహాయపడతాయి. 
 

46

బొప్పాయి

బొప్పాయి బరువు తగ్గడానికి  బొప్పాయి కూడా ఎంతో సహాయపడుతుంది. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. ఒక కప్పు బొప్పాయిలో 62 కేలరీలు మాత్రమే ఉంటాయి.
 

56

నారింజ

నారింజలో సహజంగా కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు తగ్గడంతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక నారింజలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

 

66

కివీ

బరువు తగ్గాలనుకునే వారు కివీ పండును రెగ్యులర్ డైట్ లో చర్చుకోవచ్చు. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కివీ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండు ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image2
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved