రాత్రిపూట ఈ పప్పు చారును మాత్రం తినకండి
పప్పుచార్లను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. కానీ రాత్రిపూట కొన్నిరకాల పప్పులను మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

dal
చాలా మంది రోజుకు రెండూ మూడు రోజులైనా పప్పు తింటుంటారు. నిజానికి పప్పు చార్లను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. మధ్యాహ్న భోజనమైనా, రాత్రి డిన్నరైనా వేడి వేడి అన్నాన్ని పప్పుతో తింటుంటే వచ్చే మజానే వేరు. పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.
అన్ని రకాల పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్, పొటాషియంతో పాటుగా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ ఏ పప్పుతో చేసిన చారును తిన్నా భోజనం రోజుకంటే కాస్త ఎక్కువగానే చేస్తాం. కానీ రాత్రిపూట మాత్రం కొన్ని రకాల పప్పులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని రాత్రిపూట తింటే మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
రాత్రిపూట ఈ పప్పులు తినకూడదు
కాయధాన్యాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. ఇవి మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. అయినప్పటికీ.. ఈ పప్పుల ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వీటిని సరైన సమయంలోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల కాయధాన్యాలను రాత్రిపూట అస్సలు తినకూడదు.
ఈ పప్పుధాన్యాలలో మినపప్పు, ఉలవలు, శెనగపప్పు, ఎర్రపప్పు, కందిపప్పును తినకూడదు. ఈ పప్పులను మాత్రమే కాదు కిడ్నీ బీన్స్, చిక్పీస్, వైట్ బఠానీలను కూడా రాత్రిపూట తినకూడదు. నిజానికి ఈ పప్పు దినుసులన్నీ అంత సులువుగా జీర్ణం కావు. వీటిని రాత్రిపూట తింటే ఎసిడిటీ, కడుపులో గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం, పొట్ట బరువుగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటివల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర ఉండదు. ఇది మరుసటి రోజుపై ప్రభావం చూపుతుంది.
రాత్రిపూట పప్పు చారు తినేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీకు గనుక ఇప్పటికే కడుపునకు సంబంధించిన సమస్యలు గనుక ఉంటే ఈ పప్పుతో చేసిన చారును మాత్రం తినకండి. అయితే రాత్రిపూట డిన్నర్ లో పెసరపప్పును ఎంచక్కా తినొచ్చు. ఎందుకంటే ఈ పప్పు తొందరగా జీర్ణమవుతుంది. అలాగే పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా రావు. అంతేకాదు ఈ పప్పును వండేటప్పుడు దానిలో అల్లం, ఆవాలు, వెల్లుల్లి, పసుపు వంటివి వేయండి. దీనివల్ల పప్పులు సులువుగా జీర్ణమవుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. పప్పులను మధ్యాహ్నం తినడం మంచిది.