Jackfruit: ఈ సమస్య ఉన్నవాళ్లు పనస పండు అస్సలు తినకూడదు..!
పనస తొనలను అందరూ ఇష్టంగా తింటారు. పనస పండులో చాలా పోషకాలు ఉన్నప్పటికీ, కొందరు ఈ పండు తినడం మంచిది కాదట. మరి ఎవరెవరు పనస పండు తినకూడదో.. తింటే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.

పనస పండు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. పనసపండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఈ పండును కొందరు అస్సలు తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకు తినకూడదో.. తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
షుగర్ పేషెంట్లు
పనస తొనలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు. అందులోనూ షుగర్ పేషెంట్లు అస్సలు వీటి జోలికి పోకూడదట. పనసపండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ ఉన్నవారు
అలెర్జీ లాంటి సమస్య ఉన్నవారు కూడా పనస పండు తినకూడదు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు పనసపండుకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.
కిడ్నీ వ్యాధి
పనస పండులో ఎన్ని పోషకాలున్నప్పటికీ కిడ్నీ సమస్యతో బాధపడే వారు ఈ పండు తినడం మానుకోవాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
గర్భిణీలు, బాలింతలు
గర్భధారణ సమయంలో పనస పండు తినడం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణలు. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. గర్భిణులతో పాటు పాలిచ్చే తల్లులు కూడా ఈ పండు జోలికి పోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
శస్త్ర చికిత్స
వైద్యుల ప్రకారం శస్త్రచికిత్సకు ముందు లేదా తర్వాత పనస పండు తినకూడదు. ఇది కడుపు సంబంధిత సమస్యలను పెంచుతుంది.