రాత్రిపూట పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?
పాలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలను తాగితే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. అందుకే చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు తాగుతుంటారు. కానీ రాత్రిపూట పాలను తాగితే ఏమౌతుందో తెలుసా?
పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొంతమంది పాలను ఉదయం తాగితే.. మరికొంతమంది మాత్రం రాత్రి పడుకునే ముందు తాగుతుంటారు. మనలో చాలా మంది రాత్రిపూట పాలను తాగితే బాగా నిద్రపోతామని చెప్తుంటారు. ఇది నిజమే. కొన్ని అధ్యయనాలు పాలలో ఉండే అమైనో ఆమ్లం ట్రిడోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుందని సూచిస్తున్నాయి. మెలటోనిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు మనకు నిద్రవచ్చేలా చేస్తాయి. అందుకే రాత్రిపూట పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఇది అందరికీ వర్తిస్తుందా? అంటే కాదనే చెప్పాలి. అవును కొందరికీ పాలు సమస్యలను కలిగిస్తాయి. కొన్ని రకాల ఆహారాలకు అలెర్జీ ఉన్నవారు రాత్రిపూట పాలను తిగితే అసౌకర్యంగా ఉంటుంది. ఇది వాళ్ల నిద్రను పూర్తిగా పాడు చేస్తుంది.
రోజూ రాత్రిపూట పాలు తాగితే దానిలో ఉండే పోషకాలు శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి. అలాగే శరీరంలోని ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్లు బలోపేతం అవుతాయి. పాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే గోరువెచ్చని పాలు తాగితే అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటారు. ఇది మీ బరువును పెరగకుండా కాపాడుతుంది.
milk
రాత్రి పడుకునే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్, లాక్టియం పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అలాగే మీరు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని హాయిగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
Milk
రాత్రిపూట క్రమం తప్పకుండా పాలను తాగితే వాటిలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇవి మృతకణాలను తొలగిస్తాయి. పాలలోని ముఖ్యమైన పోషకాలు రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి సహాయపడతాయి.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే పాలను క్రమం తప్పకుండా తాగితే మన శరీరం బలంగా ఉంటుంది. పాలు ప్రోటీన్ కు మంచి వనరు. అందుకే వీటిని మరీ ఎక్కువగా తాగితే మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే పాలను మోతాదులోనే తాగాలి.