చుక్క నూనె లేకుండా పూరీలను చేయొచ్చు.. ఎలాగంటే?
చాలా మంది పూరీలను ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందనే భయం ఉంటుంది. నిజానికి పూరీలకు ఉన్న నూనె మంచిది కాదు. దీనివల్ల శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తో పాటుగా మీ బరువు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే నూనె లేకుండా పూరీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇడ్లీ, దోశల కంటే పూరీలే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది పూరీలను ఇష్టంగా తింటుంటారు. కానీ పూరీలు ఆరోగ్యానికి మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిని మొత్తం నూనెలో డీప్ ఫ్రై చేసి తయారుచేస్తాయి. దీంతో పూరీలకు బాగా నూనె అంటుకుంటుంది.
ఇలాంటి ఆయిలీ పూరీలను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం ఉంటుంది. అంతేకాదు ఇది మీరు బరువు పెరిగేలా కూడా చేస్తుంది. చాలా మంది పూరీలను ఏవైనా పండుగలు లేదా స్పెషల్ ఈవెంట్స్ లోనే తయారుచేస్తుంటారు.
అయినా నూనె భయంతో పూరీలను అస్సలు తినాలనించదు. కానీ మీరు హెల్తీ పూరీలను తినాలనుకుంటే మాత్రం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. అవును దీనికోసం మీరు పూరీలను డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
=
పూరీతో పూరీలను ఎలా తయారుచేయాలి?
నూనెలోనే కాదు.. మీరు ఆవిరిలో కూడా టేస్టీ టేస్టీ పూరీలను తయారుచేయొచ్చు. నిజానికి పూరీలను ఆవిరి పట్టడం ఒక ఈజీ పద్దతి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
కానీ ఈ పూరీలు క్రిస్పీగా ఉండవు. కానీ నూనెలో వేయించిన మాదిరిగా పూరీలు బాగా ఉబ్బుతాయి. మెత్తగా ఉంటాయి. ఇందుకోసం ఏం చేయాలంటే?
ముందుగా పిండిని బాగా కలిపి బాల్స్ తయారుచేయండి. ఆ తర్వాత వాటిని గుడ్రంగా చపాతీలాగా చేసుకోండి. ఇప్పుడు స్టీమర్ ను రెడీ చేసి అందులో రోల్ చేసిన పూరీని పెట్టండి. అయితే పూరీలు ఒకటికొకటి అత్తుకోక్కుండా చూసుకోండి.
పూరీలు మెత్తబడే వరకు 5 నుంచి 7 నిమిషాలు ఆవిరిలో ఉంచండి. ఇందుకోసం గాజు మూతను ఉపయోగించండి. దీంతో పూరీలు ఉబ్బడం మీకు కనిపిస్తుంది. పూరీ ఉబ్బిన వెంటనే వాటిని ఒక ప్లేట్ లోకి తీయండి. ఈ మెత్తని పూరీని మీరు మీకు నచ్చిన కర్రీతో తినొచ్చు.
పూరీని మైక్రోవేవ్ లో ఎలా తయారుచేయాలి?
పూరీలను తక్కువ టైంలో చేయాలనుకుంటే మైక్రోవేవ్ మీకు బాగా ఉఫయోగపడుతుంది. దీనిలో పూరీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పూరీలను తయారుచేయడానికి పిండిని బాగా కలపండి. ఇప్పుడు పిండి బాల్స్ ను రోల్ చేయండి. తర్వాత మైక్రోవేవ్ ప్లేట్ లేదా ట్రేకు కొంచెం నూనెను రాయండి. ఇక పూరీలు ఎండిపోకుండా ఉండటానికి వాటిపై తడి గుడ్డను కప్పండి.
అయితే మీరు మైక్రోవేవ్ ను ముందే వేడి చేసి తర్వాత పూరీలను వేయొచ్చు. పూరీలను మైక్రోవేవ్ పై ఉంచి అధిక ఉష్ణోగ్రతపై 30-60 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయండి. దీనిలో నూనెలో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంతేకాకుండా ఒక నిమిషం కంటే తక్కువ టైంలోనే పూరీలు రెడీ అవుతాయి.
తవా లో పూరీలను ఎలా తయారుచేయాలి?
తవా లేదా ఫ్లాట్ గ్రిడ్ ను మనం చపాతీలు, రోటీలు తయారుచేయడానికే ఉపయోగిస్తుంటాం. కానీ వీటిపై నూనె లేని పూరీలను కూడా తయారుచేయొచ్చు. వీటిపై కూడా పూరీలు మెత్తగా, క్రిస్పీగా అవుతాయి. వీటిపై పూరీలను ఎలా తయారుచేయాలంటే?
ఇందుకోసం తవాను మీడియం, హై మంటపై వేడి చేయండి. తవా వేడి కాగానే పూరీలను దానిపై వేయండి. పూరీలను రెండు వైపులా 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించండి. పూరీలు బాగా ఉబ్బాలంటే పూరీని గరిటెతో నెమ్మదిగా నొక్కండి. ఇలా రెండు వైపులా చేయండి. కాకపోతే దీనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అంతే చుక్కా నూనె లేని క్రిస్పీ పూరీలు రెడీ అయినట్టే.
ఎయిర్ ఫ్రైయర్ లో పూరీలను ఎలా తయారుచేయాలి?
నూనె లేకుండా పూరీలను తయారుచేయడానికి ఎంతో ఫేమస్ అయ్యిన మార్గాల్లో ఎయిర్ ఫ్రైయర్ ను ఉపయోగించడం ఒకటి. మీకు తెలుసా? ఎయిర్ ఫ్రైయర్లు వేడి గాలిని ఉపయోగించి ఫుడ్ ను ఉడికిస్తాయి. దీంట్లో మీరు నూనె లేని హెల్తీ, టేస్టీ పూరీలను ఆస్వాదించొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?
ముందుగా పిండి బాల్స్ ను గుడ్రంగా రోల్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ను 180°Cకు ప్రీహీట్ చేయండి. పూరీలు ఉబ్బడానికి వాటిపై కొన్ని చుక్కల నీళ్లను చేయండి. లేదా బ్రష్ తో అప్లై చేయండి.
పూరీలను ఎయిర్ ఫ్రైయర్ బుట్టలో ఉంచి 5నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి. అయితే వాటిని అప్పుడప్పుడు రెండు వైపులా తిప్పుతూ ఉండండి. దీంతో అవి బాగా ఉడుకుతాయి. క్రీస్పీగా అవుతాయి.