తేనె లేదా బెల్లం.. మధుమేహులకు ఏది మంచిది?
ప్రస్తుత కాలంలో మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను మొత్తమే తినకూడదు. ఇంకొన్నింటిని లిమిట్ లోనే తినాలి.
diabetes
డయాబెటిస్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి వల్ల కొన్ని ఆహారాలను మొత్తమే తినకూడదు. ఇంకొంన్నింటినీ లిమిట్ లోనే తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కానీ ప్రస్తుతం ఎంతో మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, శరీరంలో తక్కువ ఇన్సులిన్. వీటివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మధుమేహాన్ని స్లో డెత్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ వ్యాధి 40-45 ఏండ్ల వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
Diabetes
డయాబెటిస్ పేషెంట్లు డాక్టర్ సూచించిన మందులను వాడాలి. అలాగే వీళ్లు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శరీరంలో షుగర్ లెవల్స్ వెంటనే పెరుగుతాయి. డయాబెటిక్ పేషెంట్లు తమ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలను మొత్తమే తినకూకడదు. ఎందుకంటే తీపి పదార్థాలు డయాబెటిక్ పేషెంట్లకు విషం లాంటివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తాయి.
sugar
చక్కెర ప్రత్యామ్నాయాలు
డయాబెటిస్ పేషెంట్లు చక్కెర పదార్థాలను పొరపాటుగా కూడా తినకూడదు. ఎందుకంటే చక్కెర వెంటనే మీ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. అందుకే చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను తీసుకోవాలి. బెల్లం, తేనె చక్కెరకు ఉత్తమ ప్రత్యామ్నాయాలు. రెండూ ఫుడ్ ను తీయగా ఉంచుతాయి. ఈ రెండు శరీరానికి ఎలాంటి హాని చేయవు. అలాగే ఇవి రక్తంలో స్థాయిలను పెంచవు.
బెల్లం, తేనె ఆరోగ్య ప్రయోజనాలు
తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తేనెను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇక బెల్లం విషయానికొస్తే పంచదారకు బదులు బెల్లాన్ని వాడటం చాలా మంచిది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి 1, బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనిలో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
Image: Getty Images
బెల్లం లేదా తేనె: ఏది ప్రయోజనకరంగా ఉంటుంది?
సాధారణంగా పంచదార కంటే బెల్లం లేదా తేనెనే ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. అయితే డయాబెటిక్ పేషెంట్లు షుగర్ కు దూరంగా ఉండాలి. అయితే బెల్లం, తేనె లో డయాబెటిక్ పేషెంట్లకు బెల్లమే మంచిదని భావిస్తారు. కానీ సాధారణంగా చక్కెర, బెల్లం తయారీకి మూలం ఒకటే. అందుకే డయాబెటీస్ పేషెంట్లు బెల్లానికి దూరంగా ఉండాలి. చెరకు నుంచి చక్కెరను, బెల్లాన్ని తయారుచేస్తారు. అందుకే మధుమేహులు బెల్లం తినడం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఎక్కువగా తినకూడదు. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.