MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • పచ్చి అరటికాయను తింటే ఏమౌతుందో తెలుసా?

పచ్చి అరటికాయను తింటే ఏమౌతుందో తెలుసా?

అరటిపండ్లను తింటే మన శరీరానికి వెంటనే ఎనర్జీ అందుతుంది. అలాగే కడుపు కూడా వెంటనే నిండుతుంది. అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. కానీ పచ్చి అరటికాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియదు. అసలు పచ్చి అరటికాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 08 2024, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
green banana

green banana

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

బాగా పండిన అరటిపండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే బాగా పండిన అరటిపండ్లను డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదంటారు. కానీ వీళ్లు పచ్చి అరటికాయను ఎంచక్కా తినొచ్చు. పచ్చి అరటిపండ్లలో పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

26

మలబద్దకాన్ని నయం చేస్తుంది

అరటికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే పచ్చి అరటికాయ ఉదర సంబంధ సమస్యలను,  మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

36
green banana

green banana

అల్సర్లను నయం చేస్తుంది.

నేటి కాలంలో చాలా మంది స్పైసీ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్పైసీ ఫుడ్ ను ఇష్టంగా తింటున్నారు. కానీ స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా  తింటే అల్సర్ వంటి వ్యాధుల బారిన పడతారు. అయితే పచ్చి అరటికాయలను తింటే అల్సర్లు తగ్గిపోతాయి. 
 

46


గుండె జబ్బులను నివారిస్తుంది.

ఆకుపచ్చ అరటిపండ్లలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 
 

56

బలమైన దంతాలు

రోజూ పచ్చి అరటికాయలను తింటే కాలక్రమేణా దంతాల సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు నయమవుతాయి. అలాగే దంతాలు కూడా బలంగా మారుతాయి. దంతాల సమస్యలున్నవారికి పచ్చి అరటికాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

66


శరీర బరువును తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ లను ఫాలో అవుతుంటారు. అయితే పచ్చి అరటికాయలు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును పచ్చి అరటికాయలు తొందరగా కడుపును నింపి ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Cucumber: కీరదోస తొక్కతో సహా తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved