అంజీర్ వాటర్ రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా?
అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై అంజీర్ పండ్లను నానబెట్టి వాటిని తిని ఆ వాటర్ ను తాగితే మీరు బోలెడు లాభాలను పొందుతారు. అవేంటంటే?
figs
అంజీర్ వాటర్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాటర్ లో ఫైబర్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ వాటర్ ను తాగితే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడమే కాకుండా.. మీ స్కిన్ యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంటుంది. ఈ వాటర్ మన మొత్తం శరీరాన్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది.
figs
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ వాటర్ ను తాగితే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తపోటు నియంత్రించడం, షుగర్ ను కంట్రోల్ చేయడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అసలు అంజీర్ వాటర్ ను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గుండె ఆరోగ్యం
అంజీర్ వాటర్ పొటాషియానికి మంచి వనరు. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగాలకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ వాటర్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీకు గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసమే అంజీర్ వాటర్ ను రెగ్యులర్ గా తాగాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తారు.
జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది
అంజీర్ వాటర్ జీర్ణవ్యవస్థకు కూడా మంచి మేలు చేస్తుంది. దీనిలో సహజ భేదిమందు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పేగు కదలికలను మెరుగుపరుస్తాయి.
అలాగే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేసి మిమ్మల్ని మలబద్దకం నుంచి బయటపడేస్తుంది. అంజీర్ వాటర్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు.
శక్తిని పెంచుతుంది
అంజీర్ వాటర్ లో విటమిన్ ఎ, విటమిన్ బి వంటి ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ నీటిని తాగితే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ ను రోజూ తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా మీ స్టామినా కూడా పెరుగుతుంది.
figs
డయాబెటిస్ పేషెంట్లకు మేలు
అంజీర్ వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉంటుంది.
దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ సహజ రెగ్యులేటర్ గా పని చేస్తుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. దీన్ని తాగితే మీ రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు అయ్యే అవకాశమే ఉండదు.
figs
బరువు తగ్గుతారు
బరువు తగ్గడానికి కూడా అంజీర్ వాటర్ వాటర్ ఎంతో సహాయపడుతుంది. ఈ వాటర్ లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది.
అంతేకాకుండా అనవసరమైన ఆహార కోరికలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ వాటర్ మీ జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.