MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటే, రోజంతా ఇబ్బందిపడతారు..!

బ్రేక్ ఫాస్ట్ లో ఇవి తింటే, రోజంతా ఇబ్బందిపడతారు..!

మీరు మీ రోజును అనారోగ్యకరమైన ఆహారాలతో ప్రారంభిస్తే, అది మీ రోజంతా పాడుచేయవచ్చు. అందుకే, ఏవి తినాలో కాదో, ఏవి తినకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 20 2023, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ప్రతి ఒక్కరికీ ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా, ఉదయం పూట తీసుకునే ఆహారం, మనకు రోజంతా  ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. మంచి రోజును ప్రారంభించడానికి మంచి అల్పాహారం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, అది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది, కానీ దీనికి విరుద్ధంగా, మీరు మీ రోజును అనారోగ్యకరమైన ఆహారాలతో ప్రారంభిస్తే, అది మీ రోజంతా పాడుచేయవచ్చు. అందుకే, ఏవి తినాలో కాదో, ఏవి తినకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.పండ్ల రసం

రోజు ప్రారంభించడానికి పండ్ల రసం ఒక గొప్ప ఎంపిక అని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నిజానికి, పండ్ల రసంలో పీచుపదార్థాలు ఉండవు, దీనివల్ల ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందువల్ల, మధుమేహం, జీవక్రియ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ముఖ్యంగా హానికరం. పండ్ల రసానికి బదులు నిమ్మరసం,కీర దోసకాయ రసం మొదలైన వాటితో రోజు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

36
pan cake

pan cake


2.పాన్‌కేక్‌లు, వాఫ్ఫల్స్

బ్రేక్ ఫాస్ట్ లో మనకు తినడానికి చాలా ఆప్షన్లు ఉంటాయి. కాగా, ఎక్కువ మంది త్వరగా అయిపోయేవి, చేయడానికి ఈజీగా ఉండేవి ఎంచుకుంటారు.  పాన్‌కేక్‌లు, వాఫ్ఫల్స్ ఈ ఎంపికలలో ఒకటి. వీటిని చాలా మంది అల్పాహారం కోసం తినడానికి ఇష్టపడతారు. అయితే, మీ రోజును ప్రారంభించడానికి ఇది మంచి ఎంపిక కాదు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల రోజంతా అనారోగ్యకరమైన ఆహారాలను తినాలనే కోరికను కలిగిస్తుంది, ఇది మీ శక్తిని తగ్గిస్తుంది.

46

 

3. టీ

చాలామంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. ప్రజలు ఉదయాన్నే టీ తాగే అలవాటును కలిగి ఉంటారు, కొన్నిసార్లు అది లేకుండా వారు అసౌకర్యంగా భావిస్తారు. అయితే, రోజు ప్రారంభించడానికి టీ అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. దీని కారణంగా, మీకు ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు ఉండవచ్చు. ఇది రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.
 

56

4. తృణధాన్యాలు

 తృణధాన్యాలు చాలా మంది ప్రజల ఉదయం భాగం. అల్పాహారం కోసం ఇది ఆరోగ్యకరమైన ఎంపిక అని ప్రజలు నమ్ముతారు. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు. ఇందులోని అధిక షుగర్ కంటెంట్,  పీచుపదార్థం లేకపోవడం వల్ల మీ ఉదయం ప్రారంభించడానికి ఇది సరైన ఎంపిక కాదు.
 

66

5.కాఫీ


ఒక కప్పు కాఫీతో రోజు ప్రారంభించే వారిలో మీరు కూడా ఒకరు అయితే, మీ ఈ అలవాటును వెంటనే మార్చుకోండి. ఉదయాన్నే కాఫీ తాగడం కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది హార్మోన్ల సమతుల్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, రక్తపోటును పెంచుతుంది . అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే బదులు అల్పాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved