MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • గోధుమ పిండి ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

గోధుమ పిండి ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఇక నుంచి అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే... ఎన్ని రోజులు అయినా.. పిండి పాడవ్వకుండా తాజాగా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 19 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గోధుమ పిండిని మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం.  ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి.. ఇంట్లో కూడా ఎక్కువగా తెచ్చి స్టోర్ చేస్తూ ఉంటాం. కానీ... ఈ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తాజాదనం తగ్గిపోతుంది. పిండి ఒకరకమైన వాసన వస్తూ ఉంటుంది. ఒక్కోసారి పురుగులు కూడా పడుతూ ఉంటాయి. చేసేదిలేక... ఆ పిండిని పారబోస్తూ ఉంటాం. మీకు కూడా  ప్రతిసారీ ఇదే జరుగుతోందా..? అయితే.. ఇక నుంచి అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే... ఎన్ని రోజులు అయినా.. పిండి పాడవ్వకుండా తాజాగా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అసలు.. పిండి ఎందుకు పాడైపోతుంది..?

 సాధారణంగా అది గోధుమ పిండి అయినా, ఇంకేదైనా పిండి అయినా.. పాడవ్వకుండా ఉండాలంటే.. దానిని ఉంచిన కంటైనర్ కి గాలి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే... గాలి తగలడం మొదలుపెడితే.. ఆ పిండి తొందరగా పాడౌతుంది. ఆ పిండిలోని ప్లేవర్స్ అన్నీ పోయి.. దుర్వాసన రావడం మొదలౌతుంది.
 

37

లేదు అంటే.. మనం పిండిలో చేతులు పెడుతున్నప్పుడు.. వాటికి కాస్త తడి తగిలినా కూడా పిండి పాడైపోతుంది. పిండి ఎప్పుడూ పొడిగానే ఉండాలి. అలా కాకుండా.. కాస్త చిన్న తడి చుక్క తగిలినా వెంటనే పురుగులు పట్టడం మొదలౌతుంది. మామూలుగానే పిండి.. పురుగులను ఆకర్షిస్తుంది. ఒక్కసారి పురుగులు వస్తే.. ఆ పిండిని తినకుండా ఉండటమే మంచిది. దానికి దూరంగా ఉండాలి.

47

పిండిని స్టోర్ చేసేటప్పుడు  చాలా జాగ్రత్తగా ఉండాలి.  వెలుతురు తగలకుండా...  గాలి తగలకుండా.. ఉండే కంటైనర్ ఎంచుకోవాలి. దాని వల్ల  పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా సహాయపడుతుంది.

57

పిండిని నిల్వ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన దశ ఏమిటంటే అది వచ్చిన అసలు బ్యాగ్ నుండి గాలి చొరబడని ఆహార నిల్వ కంటైనర్‌లోకి తీసుకెళ్లడం. ఈ రకమైన కంటైనర్ తేమ , దోషాలు దూరంగా ఉండేలా చేస్తుంది. మీ పిండిని 10 నెలల వరకు పాడవ్వకుండా తాజాగా ఉంచుతుంది.  

67
refined flour

refined flour

మీ పిండిని చీకటి , పొడి వాతావరణంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం.  ఇక సాధారణంగా ఎవరైనా పిండి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే.. కట్ చేసి కంటైనర్ లో పెడుతూ ఉంటారు. దానిపై కవర్ ఉండదు కాబట్టి.. ఎక్స్ పైరీ డేట్ మనకు తెలీదు. అలా కాకుండా.. కంటైనర్ పైన అయినా.. దాని ఎక్స్ పైరీ డేట్ రాసుకొని ఉంచుకోవాలి. దాని వల్ల.. ఆ పిండిని ఎంత కాలం వాడొచ్చు అనే అవగాహన మనకు కూడా ఉంటుంది.

77
Image: Freepik

Image: Freepik

మీ పిండిని నిల్వ చేయడానికి , తాజాగా ఉండేలా చూసుకోవడానికి మీ పిండిని వాక్యూమ్ సీలింగ్ చేయడం మరొక గొప్ప ఎంపిక. ఈ పద్ధతి రెండు సంవత్సరాల వరకు పిండి బాగా ఉండేందుకు సహాయపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved