అన్నం, పప్పు తింటే ఏమౌతుందో తెలుసా?
పప్పు, అన్నం కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. చాలా మంది వారానికి మూడు నాలుగు సార్లైనా అన్నం, పప్పు తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
మన దేశంలో రోజుకు మూడు పూటలా అన్నాన్నే తినే వారున్నారు. అంతేకాదు అన్నంలో పప్పును ఇష్టంగా తినేవారు కూడా చాలా మంది ఉన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మాంసం ఉన్నా.. ఖచ్చితంగా పప్పును చేస్తారు. ఎందుకంటే పప్పును తినేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి. చాలా మంది ఇండ్లలో కూడా వారానికి నాలుగైదు సార్లైనా పప్పు చారును చేస్తుంటారు.
అన్నం, పప్పు కాంబినేషన్ అదిరిపోతుందన్న సంగతి అందరికీ తెలుసు.కానీ ఇది ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో అన్న ముచ్చట మాత్రం ఎవ్వరికీ తెలియదు. అన్నం, కాయధాన్యాలను రోజూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దాల్ రైస్ భారతీయ ఆహారంలో ఒక అంతర్భాగం. చాలా మందికి ఇది చాలా కంఫర్ట్ ఫుడ్ కూడా. అంటే దీనిని తిని మంచి అనుభూతిని చెందుతారన్న మాట. దీన్ని తయారుచేయడం చాలా ఈజీ.
అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. అంతేకాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు పప్పు, అన్నాన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పప్పన్నంలోని పోషకాలు
ప్రోటీన్: దాల్ రైస్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల మ శరీరంలోని కండరాలను నిర్మించడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి అవసరమైన ప్రోటీన్ కాయధాన్యాల ద్వారా పుష్కలంగా అందుతుంది. అలాగే దీనిలో మన శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు రైస్ లో మెండుగా ఉంటాయి.
విటమిన్లు, ఖనిజాలు: అన్నం, పప్పుల్లో విటమిన్-బి కాంప్లెక్స్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే ఫైబర్ కంటెంట్ కాయధాన్యాల్లోనే కాదు బియ్యంలో కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పప్పు, అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది: బియ్యం, పప్పు రెండింటిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రెండింటిని తినడం వల్ల అజీర్ణం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ సమస్యలు రావు కూడా.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పప్పు, అన్నం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. కాయధాన్యాల్లో ఫోలేట్ మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది.
బరువును తగ్గించడానికి సహాయపడుతుంది: దాల్ రైస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇది మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా చేస్తుంది. అందుకే ఇది మీరు బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇకపోతే బియ్యం, పప్పుల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. అలాగే కాయధాన్యాల్లో కాల్షియం, భాస్వరంలు మెండుగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచుతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: బియ్యం, పప్పుల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఇదొక న్యూరోట్రాన్స్మిటర్. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. పప్పుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.
రోజూ అన్నం, పప్పు తినడం మంచిదేనా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాధారణంగా ప్రతిరోజూ అన్నం, పప్పును తినడం మంచిదే. అయితే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం అన్నాన్ని లిమిట్ లోనే తినాలి. ఎందుకంటే అన్నం మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
అయితే పప్పులు, బియ్యం మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాగే మన గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటితో పాటుగా కూరగాయలను, పెరుగు వంటి ఇతర హెల్తీ ఆహారాలను కూడా తినాలి.