ఒక 14 రోజులు పరిగడుపున కరివేపాకును తింటే ఏమౌతుందో తెలుసా?
కరివేపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో 5-7 కరివేపాకు ఆకులను 14 రోజుల పాటు నమిలితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే చెడు ఆహారాన్ని తింటే ఆరోగ్యం పాడవుతుంది. మంచి ఆహారం తింటే ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి.
మీకు తెలుసా? మనం తినే హెల్తీ ఫుడ్డే మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎన్నో ఆహారాలు సహాయపడతాయి. ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వేప వంటి ఎన్నో ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే చాలా మంది రెగ్యలర్ గా వంటల్లో కరివేపాకును వేస్తుంటారు. అంటే మంచి వాసన కోసమే, లేకపోతే టేస్ట్ కోసమే వేస్తుంటారు. కానీ ఈ ఆకులు మన ఆరోగ్యానికి చాలా మంచివి.
వీటిని గనుక మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తింటే మాత్రం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5 నుంచి 7 కరివేపాకులను ఒక 14 రోజుల పాటు తింటే మీ శరీరంలో మీరు ఎన్నో అద్బుతాలను చూస్తారు. అసలు పరిగడుపున కరివేపాకును తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కరివేపాకును 14 రోజులు ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది?
యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక కరివేపాకును పరిగడుపున తింటే మీ ముఖం అందంగా మారిపోతుంది. నిపుణుల ప్రకారం.. కరివేపాకులో చర్మాన్ని మెరిపించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మీరు రెండు వారాల పాటు పరిగడుపున 5 నుంచి 7 కరివేపాకులను నమలడం మొదలుపెడితే.. ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
కరివేపాకు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కరివేపాకును పరిగడుపున తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇది మలబద్దకం, అజీర్థి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
కరివేపాకులో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను రోజూ పరిగడుపున తింటే రోగనిరోధక శక్తి పెరిగి మీరు ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. రోజూ పొద్దున్నే పరిగడుపున కరివేపాకును నమిలితే బరువు కూడా తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీనిని రోజువారి డైట్ లో చేర్చుకోవాలి.
డయాబెటీస్ పేషెంట్లకు కూడా కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. ఒక 14 రోజుల పాటు కరివేపాకును పరిగడుపున నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. అందుకే డాక్టర్లు పరిగడుపున వీటిని తినాలని చెప్తారు.
శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి కూడా కరివేపాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రోజూ ఈ ఆకులను నమలడం వల్ల మీ శరీరం నిర్విషీకరణ చెందుతుంది. రోజూ పరిగడుపున కరివేపాకును నమలడం వల్ల జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.
హెయిర్ ఫాల్ ఉన్నవారు వీటిని తింటే చాలా తేడాను గమనిస్తారు. కరివేపాకు జీర్ణ రసం స్రవించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని ప్రతిరోజూ పచ్చిగా పరిగడుపున తింటే మీరు తిన్నది సక్రమంగా జీర్ణమవుతుంది. కాలెయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.