Weight loss:సజ్జ, మొక్కజొన్న.. ఏ రోటీ తింటే.. బరువు తగ్గుతాం..?
ఈ రెండింటిలో... ఏ రోటీ తినడం వల్ల .. మనం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందో..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
బరువు తగ్గాలి అని అనుకునే వారందరూ ముందుగా చేసే పని.. రైస్ తినడం మానేస్తారు. ఆ రైస్ స్థానంలో రోటీలు తినడం మొదలుపెడతారు. అయితే.. మీరు ఏ రోటీ తింటున్నారు...? ఒకప్పుడు అయితే.. అందరూ గోధుమలతో చేసిన రోటీని తినడానికి ఇష్టపడేవారు.
కానీ ఇప్పుడు.. రకరకాల పప్పులతో తయారు చేసిన పిండి అందుబాటులో ఉంటోంది. వాటిల్లో.. సజ్జలు, మొక్కజొన్నలు.. మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరి .. ఈ రెండింటిలో... ఏ రోటీ తినడం వల్ల .. మనం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందో..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
1.సజ్జ రోటీ..
ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు.. ఈ సజ్జ రోటీని ఎంచుకోవచ్చు. దీనిలో.. ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ సజ్జల్లో గ్లూటెన్ అస్సలు ఉండదు. దీనిలోని అధిక ఫైబర్.. రక్తంలోని గ్లూకోచ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల.. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను పూర్తిగా తగ్గిపోతాయి
దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో.. తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని కారణంగా ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది . ఇది తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు.. సజ్జ రోటీ తినడం వల్ల.. శరీంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవట. క్యాన్సర్ మన దరిచేరకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
मक्के की रोटी
2.మొక్కజొన్న రోటీ..
మొక్కజొన్న ఉత్తరభారతంలో చాలా ఎక్కువగా వినియోగిస్తారు. ఇది సాధారణంగా శీతాకాలంలో వినియోగిస్తారు. దీనిని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. మొక్కజొన్నలో ఐరన్, ఫాస్పరస్, జింక్ , వివిధ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అనామ్లజనకాలు సమృద్ధిగా, మొక్కజొన్న పిండి కంటి చూపుకు మంచిదని నిరూపించబడింది. క్యాన్సర్, రక్తహీనత నివారణలో కూడా సహాయపడుతుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ , బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి, ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి .ఇది బరువును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఇక ఈ రెండింటిలో.... బరువు తగ్గాలంటే ఏది ఎంచుకోవాలి అనే విషయం మాత్రం.. మన ఎలా బరువు తగ్గాలి అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ బరువు తగ్గాలి అనుకునే వారు.. సజ్జ పిండిని ఎంచుకోవాలి. మొక్కజొన్న కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ.. గ్యాస్ట్రిక్ సమస్యలను తెచ్చిపెడుతుందట. కాబట్టి.. సులభంగా, వేగంగా బరువు తగ్గాలి అనుకునేవారు.. సజ్జ పిండిని ఎంచుకోవడం ఉత్తమం.