మామిడి పండుతో కలిపి వీటిని అస్సలు తినకూడదు..!
కానీ మామిడి పండ్లు తినే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు ఎంతో ఇష్టమైన ఈ మామిడి పండ్లను కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దామా..
వేసవి వచ్చింది అంటే చాలు అందరికీ మామిడి పండ్లు తినాలని అనిపిస్తుంది. అసలు చాలా మంది మామిడి పండ్ల కోసమే సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. మార్కెట్లలో ఎక్కడ చూసినా పండిన మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. కానీ మామిడి పండ్లు తినే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు ఎంతో ఇష్టమైన ఈ మామిడి పండ్లను కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దామా..
1.ఈ సమ్మర్ లో మనందరికీ ముఖ్యంగా పిల్లలకు మామిడి పండ్లు తినడం అంటే ఎంత ఇష్టమో, ఐస్ క్రీములు తినడం కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం ఉన్నా, ఈ రెండింటిని కలిపి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2.ఇక కొందరు పండ్లు ఏవైనా పండ్లే కదా అని అన్ని పండ్లు కలిపి తినేస్తూ ఉంటారు. అయితే.. మామిడితో కలిపి సిట్రస్ పండ్లను మాత్రం అస్సలు తినకూడదట. అంటే నారింజ, నిమ్మ లాంటి పండ్లను మామిడితో కలిపి తీసుకోకూడదు.
3.ఇక మనలో చాలా మందికి మామిడి పండును పెరుగుతో కలిపి తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ, ఈ రెండింటినీ అస్సలు కలిపి తీసుకోకూడదట. మామిడి మన శరీరంలో వేడిని పెంచుతుంది. పెరుగు వేడి తగ్గిస్తుంది. రెండు భిన్న లక్షణాలు ఉన్న ఈ ఆహారాలను కలిపి తినకూడదు.
4.మీరు నమ్మరు కానీ, చాలా మంది కూరగాయలతో , రోటీలతో కూడా మ్యాంగో తీసుకుంటూ ఉంటారు. ఈ కాంబినేషన్స్ అస్సలు మంచిది కాదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
Image: Getty Images
5.కూల్ డ్రింక్స్ తో కలిపి మామిడి పండు అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి, ఈ కాంబినేషన్ మంచిది కాదు.
6.ఇక మార్కెట్లో ప్రస్తుతం మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అవి తొందరగా పండేందుకు కెమికల్స్ వాడే అవకాశం ఉంది. కాబట్టి కెమికల్స్ పండ్లపై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తినే ముందు పండ్లను నీటితో బాగా కడిగి ఆ తర్వాతే తినాలి.
mango fruits
7.భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు ఆగి మామిడి పండ్లను తినాలి. ఇలా తినడం వల్ల మంచిగా జీర్ణం అవుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా కూడా ఇబ్బంది పడతారు.