మామిడి పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా?
ఒక్క ఎండాకాలంలో తప్ప మరే సీజన్ లో మామిడి పండ్లు దొరకవు. అందుకే ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లను రోజూ తింటూనే ఉంటారు. అసలు ఎండాకాలంలో మామిడి పండ్లను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మామిడి పండ్లంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందులోనూ ఈ పండు ఒక్క ఎండాకాలంలోనే లభిస్తుంది. అందుకే ఈ సీజన్ పోతే పండ్లు దొరకవని రోజూ లాగిస్తుంటారు. అయితే ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా ఎన్నో ఔషదగుణాలను కూడా కలిగి ఉంటుంది. మామిడి పండును తింటే మన శరీరానికి శక్తి అందుతుంది. ఈ మామిడిలో కొలెస్ట్రాల్, సోడియం, ప్రోటీన్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. అసలు ఎండాకాలంలో మామిడి పండ్లను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్తపోటును తగ్గిస్తుంది
మామిడి పండ్లలో విటమిన్లు, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి సహాయపడతాయి. ఈ మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే ఈ పండ్లను హైబీపీ ఉన్నవారు తినొచ్చు. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి.
Image: Getty
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
ఎండాకాలంలో మామిడి పండును తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. వీటిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ మామిడి పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. కానీ మామిడి పండ్లను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
mango
జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది
ఒక్కోసారి మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనివల్ల అజీర్తి, కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అయితే మామిడి పండును తింటే అజీర్ణం, ఎసిడిటీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. మామిడి పండ్లలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫుడ్ సహజంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
Mangoes
రక్తహీనత
మామిడి పండులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మామిడి పండ్లను సరైన సమయంలో తింటే రక్తహీనత సమస్య నయమవుతుంది.
mango
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మండే ఎండాకాలంలో మామిడి పండును తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మామిడి పండ్లలో బీటా కెరోటిన్, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.