రాత్రి హాయిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?
గజిబిజీ లైఫ్ లో తినడానికే కాదు నిద్రపోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. ఒకవేళ ఉన్నా కంటినిండా నిద్రరాక ఇబ్బంది పడేవారున్నారు. అయితే రాత్రిళ్లు కొన్ని పాలను తాగితే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అవేంటంటే?
గోరువెచ్చని పాలను తాగితే మన ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం అందుతుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి హాయిగా కూడా నిద్ర వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నార్మల్ పాలు కాకుండా అందులో జాజికాయ పౌడర్ వేసి తాగితే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును గ్లాస్ పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేయడం వల్ల మీరు బాగా విశ్రాంతి తీసుకుంటారు. అలాగే నరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో మీరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
nutmeg
జాజికాయ ప్రయోజనాలు
రాత్రి పడుకునే ముందు జాజికాయను తీసుకోవడం వల్ల మనకున్న జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. జాజికాయ పాలను తయారుచేయడానికి మీరు చేయాల్సిందల్లా వేడి పాలలో ఫ్రెష్ జాజికాయ పౌడర్ ను వేసి కలపితే చాలు. రుచికోసం మీరు తురిమిన బాదం లేదా ఖర్జూరాలను వేసుకోవచ్చు. ఈ పాలను బాగా కలిపి నిద్రపోవడానికి ముందు తాగితే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.
జాజికాయ పాలను నిద్రపోయే ముందు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడానికి బాగా ఉపయోగిస్తున్నారు. జాజికాయ మనల్ని ప్రశాంతంగా ఉంచి నిద్రవచ్చేలా చేస్తుంది.
జాజికాయలో మిరిస్టిసిన్, ఎలిమైసిన్ తో పాటుగా బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో మాంగనీస్, రాగి, మెగ్నీషియం, విటమిన్ బి 6 వంటి ఖనిజాలు, విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి, నియంత్రణకు ఎంతో అవసరమవుతాయి. ఇవి నిద్ర-మేల్కొనే చక్రాలకు అవసరం.
జాజికాయ పాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. నిద్రపోవడానికి ముందు జాజికాయ పాలు తాగడం వల్ల ఆందోళన తగ్గుతుంది. నిపుణుల ప్రకారం.. జాజికాయ నిద్రలేమి లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.