MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఎందుకు అవమానించారు? ఆనాడు బేగంపేట ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?

సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఎందుకు అవమానించారు? ఆనాడు బేగంపేట ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?

1982లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా పనిచేస్తున్న టీ. అంజయ్యను రాజీవ్ గాంధీ అందరి ముందే అవమానించారు. ఈ ఘటన తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని భావించిన ఎన్టీఆర్.. టీడీపీని స్థాపించి కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. అసలు ఆరోజు ఏం జరిగిందంటే..

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 13 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాజీవ్ గాంధీ   టి. అంజయ్య వివాదం ఏమిటి?
Image Credit : Gemini AI

రాజీవ్ గాంధీ - టి. అంజయ్య వివాదం ఏమిటి?

రాజకీయాల్లో నాయకులకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి... అలాకాదని ప్రతిదానికి కోపం, అసహనం ప్రదర్శిస్తే పతనం తప్పదు. ఇలా ఓ సందర్భంలో రాజీవ్ గాంధీ వ్యవహరించిన తీరు ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలనే మార్చేసింది. 1982లో హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. అప్పట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)… ఉమ్మడి ఏపీ సీఎం టీ. అంజయ్యను (T. Anjaiah) అందరి ముందే తీవ్రంగా అవమానించారని చెబుతుంటారు. ఈ ఘటనే సినీనటుడిగా ఉన్న ఎన్టీఆర్ తో 'తెలుగు ఆత్మగౌరవం' అనే పెద్ద ఉద్యమానికి నాంది పలికించి రాజకీయ రంగప్రవేశం చేయించింది. ఇలా పుట్టుకొచ్చిన 'తెలుగుదేశం పార్టీ' (TDP).. దశాబ్దాల పాటు ఏపీని ఏలిన కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పేదరికం నుంచి సీఎం కుర్చీ దాకా.. టి. అంజయ్య రాజకీయ ప్రస్థానం
Image Credit : Instagram/Anji Reddy Nallavelli

పేదరికం నుంచి సీఎం కుర్చీ దాకా.. టి. అంజయ్య రాజకీయ ప్రస్థానం

మెదక్ జిల్లా భానురులో పుట్టిన టంగుటూరి అంజయ్య జీవితం చాలా పేదరికంలో మొదలైంది. ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలోనే ఆపేసిన ఆయన.. హైదరాబాద్ ఆల్విన్ (Allwyn) కంపెనీలో రోజుకు కేవలం ఆరు పైసల కూలీగా చేరారు. ఆ తర్వాత కార్మికుల హక్కుల కోసం పోరాడి యూనియన్ లీడర్‌గా ఎదిగారు.

ఇందిరా గాంధీకి వీర విధేయుడైన అంజయ్య.. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కార్మిక మంత్రి అయ్యారు. 1980లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో, ఇందిరా గాంధీ ఆదేశాలతో అంజయ్యను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. పరిపాలనా దక్షత కంటే ఇందిరమ్మ పట్ల ఉన్న విధేయతే ఈ సామాన్య నాయకుడికి సీఎం పదవి తెచ్చిపెట్టింది.

బేగంపేట్ ఎయిర్‌పోర్టులో అంజయ్యకు అవమానం

అసలు వివాదం 1982 ఫిబ్రవరిలో మొదలైంది. ప్రధాని ఇందిరా గాంధీ కొడుకు, కొత్తగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన రాజీవ్ గాంధీ ప్రైవేట్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చారు. రాజీవ్‌కు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవీ లేకపోయినా, హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం అంజయ్య భారీ స్వాగతం పలకాలని డిసైడ్ అయ్యారు.

విమానాలు అద్దెకు తీసుకొని, హెలిప్యాడ్లు కట్టించి, ఎయిర్‌పోర్ట్ చుట్టూ వందలాది స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ ఫ్లైట్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో (Begumpet Airport) దిగగానే.. సీఎం అంజయ్య ఆధ్వర్యంలో 200 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఐదుగురు మంత్రులు, డప్పు చప్పుళ్లు, పూలమాలలతో భారీ హంగామా చేశారు. పార్టీ నాయకుడి ప్రైవేట్ ట్రిప్‌కు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని అప్పటికే విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.

అయితే ప్రతిపక్షాలే కాదు ఫ్లైట్ దిగిన రాజీవ్ గాంధీ ఈ హంగామా చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జనం, మీడియాతో పాటు అందరి ముందే సీఎం అంజయ్యను తీవ్రంగా మందలించారు. ఆయన్ను పబ్లిక్‌గా "బఫూన్" (Buffoon) అని తిట్టారని చెబుతుంటారు. "15 నిమిషాల్లో ఈ గోల ఆపకపోతే నేను వెంటనే ఢిల్లీకి వెళ్లిపోతా" అని వార్నింగ్ ఇచ్చారట. పైలెట్ గా అనుభవం ఉంది కాబట్టి విమాన భద్రతా నిబంధనల గురించి రాజీవ్ గాంధీకి తెలుసు... అందుకే ప్లైట్ ఆగకముందే రన్ వే పైకి రావడంవల్లే అంజయ్యపై సీరియస్ అయ్యారని చెబుతారు.

తన అభిమాన నాయకురాలి కొడుకు ఇలా ప్రవర్తించడంతో కంగుతిన్న సీఎం అంజయ్య.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు చెప్పారు. రాజీవ్ గాంధీ పూలమాలలు తీసుకోకుండా, నేరుగా ఢిల్లీకి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత నాయకుల బతిమాలుకోవడంతో తిరుపతి వెళ్లడానికి ఒప్పుకున్నా.. సీఎం అంజయ్యను మాత్రం తనతో తీసుకెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిపోయారు.

అంజయ్య ఎమోషనల్ కామెంట్స్

ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందనే సాకుతో ఇందిరా గాంధీ.. అంజయ్యను సీఎం పదవి నుంచి తీసేశారు. పదవి పోయినా ఇందిరమ్మపై భక్తి తగ్గని అంజయ్య.. "నేను మేడమ్ (ఇందిరా గాంధీ) దయ వల్లే అధికారంలోకి వచ్చాను, ఇప్పుడు ఆమె ఆదేశాలతోనే పదవి వదులుకుంటున్నాను. నేను ఎలా సీఎం అయ్యానో, ఎందుకు దిగిపోతున్నానో నాకే తెలియదు" అని ఎమోషనల్ అయ్యారు.

33
'తెలుగువారి ఆత్మగౌరవం' ఉద్యమం.. కాంగ్రెస్ పతనం
Image Credit : Asianet News

'తెలుగువారి ఆత్మగౌరవం' ఉద్యమం.. కాంగ్రెస్ పతనం

ఢిల్లీకి చెందిన ఒక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ.. ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పనివాడిలా చూసి పబ్లిక్‌గా అవమానించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచింది. దీన్ని కేవలం అంజయ్యకు జరిగిన అవమానంగా తెలుగు ప్రజలు చూడలేదు. ఢిల్లీ హైకమాండ్ 'తెలుగు ప్రజలకు, రాష్ట్ర ఆత్మగౌరవానికి చేసిన అవమానం'గా భావించారు.

ఈ ఘటనతో రగిలిపోయిన టాలీవుడ్ సూపర్ స్టార్ ఎన్టీ రామారావు (NTR).. 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదంతో 'తెలుగుదేశం పార్టీ' (TDP) ని స్థాపించారు. కాంగ్రెస్ అహంకారంపై చైతన్య రథయాత్ర చేసి రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేశారు. ఫలితంగా 1983 ఏపీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ మూడింట రెండొంతుల మెజారిటీతో చరిత్రలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు గెలిచి ప్రధాని అయినా.. ఏపీలోని 44 సీట్లలో కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 6 సీట్లు మాత్రమే.

తెలంగాణ ఉద్యమానికి కూడా అవమానమే కారణం

విశేషం ఏంటంటే.. ఏపీలో ఢిల్లీ హైకమాండ్ అంజయ్యను అవమానించడం టీడీపీ పుట్టుకకు ఎలా కారణమైందో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఇలాంటి రాజకీయ తిరస్కారమే కారణమైంది.

1995లో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి సీఎం అయిన చంద్రబాబు నాయుడు.. 1999 ఎన్నికల తర్వాత కే. చంద్రశేఖర్ రావు (KCR) కు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ తిరస్కారంతో రగిలిపోయిన కేసీఆర్.. టీడీపీని వీడి 2001లో 'తెలంగాణ రాష్ట్ర సమితి' (TRS/BRS) పార్టీని స్థాపించి, ప్రత్యేక 'తెలంగాణ' రాష్ట్ర సాధన కోసం పోరాడి విజయం సాధించారు.

మొత్తానికి ప్రజాప్రతినిధులు, ప్రాంతీయ నాయకుల పట్ల చూపే చిన్న అహంకారం, అవమానం.. దశాబ్దాల సామ్రాజ్యాలను ఎలా కూల్చేస్తాయో చెప్పడానికి 'టీ. అంజయ్య - రాజీవ్ గాంధీ' ఎపిసోడ్ భారత రాజకీయ చరిత్రలో ఒక శాశ్వత ఉదాహరణగా మిగిలిపోయింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐర‌న్ చేసేప్పుడు దుస్తుల‌పై నీళ్లు ఎందుకు చ‌ల్లుతారు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Recommended image2
River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!
Recommended image3
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
Sr NTR Car Craze: సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరు సొంతం చేసుకున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved