MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Peacock Dance : నెమలి నాట్యం ఎందుకు చేస్తుంది? ఇది నిజంగానే వర్ష హెచ్చరికా?

Peacock Dance : నెమలి నాట్యం ఎందుకు చేస్తుంది? ఇది నిజంగానే వర్ష హెచ్చరికా?

పురివిప్పి ఆడే నెమలిని చూడగానే వర్షం పడుతుందని పెద్దలు అంటుంటారు. మరి నెమలి నాట్యం నిజంగానే వానకు సంకేతమా? లేక ఈ డ్యాన్స్ వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 20 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది?
Image Credit : Gemini AI

నెమలి ఎందుకు నాట్యం చేస్తుంది?

నెమలి నాట్యం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చిరుజల్లుల సమయంలో పురివిప్పి ఆడే నెమలిని చూడ్డానికి రెండు కళ్లు చాలవు... కవులు సైతం వర్ణించేస్థాయిలో ఈ నాట్యం ఉంటుంది. మీరాబాయి వంటి కవులు కూడా తమ కవితల్లో కృష్ణుడితో పాటు నెమలి నాట్యం చేయడాన్ని వర్షానికి సూచనగా వర్ణించారు. సాధారణంగా కూడా వర్షాకాలంలోనే నెమలి నాట్యం ఎక్కువగా కనిపిస్తుంటుంది... అందుకే దీన్ని వర్షానికి సూచనగా భావిస్తుంటారు. వాతావరణ శాఖ సూచనలేమీ లేని సమయంలో నెమలి పురివిప్పి ఆడితే వర్షం వస్తుందని ప్రజలు నమ్మేవారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెమలి డ్యాన్స్ వెనకున్న రహస్యమిదే..
Image Credit : Getty

నెమలి డ్యాన్స్ వెనకున్న రహస్యమిదే..

నెమలి నాట్యం చేయడం వర్షం వస్తుందనేదానికి సంకేతమని ఇప్పటికీ చాలామంది భావిస్తారు. కానీ వర్షానికి, నెమలి నాట్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందా? అంటే సైన్స్ లేదని చెబుతోంది. నెమలి నాట్యం వర్షానికి సూచన కాదు... మరి ఇప్పుడే అవి డ్యాన్స్ చేస్తూ ఎందుకు కనిపిస్తాయంటే ఇది నెమళ్లు జతకట్టే కాలం. వసంతకాలం నుంచి వర్షాకాలం వరకు నెమళ్లు జతకడతాయి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అన్నమాట. ఆడ నెమలిని ఆకర్షించడానికి మగ నెమళ్లు తమ రెక్కలను విప్పి నాట్యం చేస్తాయి.

Related Articles

Related image1
Anand Mahindra Peacock Video : మీ మనసుల్ని తప్పకుండా కదిలిస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
Related image2
Peacock Feather నెమలి పింఛాలతో లక్కీ.. ఎక్కడ పెట్టాలో తెలుసా?
35
నెమలి డ్యాన్స్ ఎందుకంత అద్భుతంగా ఉంటుంది?
Image Credit : Getty

నెమలి డ్యాన్స్ ఎందుకంత అద్భుతంగా ఉంటుంది?

మగ నెమళ్లు ఆడ నెమళ్లను ఆకర్షించడానికి అద్భుతంగా నాట్యం చేస్తాయి. అందమైన విసనకర్రలా తమ రంగురంగుల ఈకలను విప్పి, ఆడ నెమలిని మెప్పించడానికి ప్రయత్నిస్తాయి. వాటి ప్రదర్శన ఎంత ఆకర్షణీయంగా, శక్తిమంతంగా ఉంటే ఆడ నెమలి అంత త్వరగా ఆకర్షితురాలవుతుందట. అందుకే చాలా ఒపికగా గంటలతరబడి నెమళ్లు నాట్యం చేస్తాయి.

45
ఆడ నెమలి తన భాగస్వామిని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది?
Image Credit : Getty

ఆడ నెమలి తన భాగస్వామిని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది?

సాధారణంగా ఆడ నెమలి (పీహెన్) తన భాగస్వామిగా ఏ మగ నెమలిని ఎంచుకోవాలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అది మగ నెమలి కదలికలను చాలా నిశితంగా గమనిస్తుంది. మగ నెమలి తన ఈకలను విప్పినప్పుడు, అది తన ఫిట్‌నెస్, బలం, జన్యు నాణ్యతను ప్రదర్శిస్తుంది. ప్రకాశవంతమైన, ఏకరీతిలో ఉన్న ఈకలు, శక్తిమంతమైన ప్రదర్శన ఆరోగ్యకరమైన పక్షిని సూచిస్తాయి. ఆడ నెమళ్లు ఈ లక్షణాల ఆధారంగానే తమ భాగస్వామిని ఎంచుకుంటాయి.

55
వర్షాకాలమే నెమళ్లు జతకట్టడానికి కారణమేంటి?
Image Credit : Getty

వర్షాకాలమే నెమళ్లు జతకట్టడానికి కారణమేంటి?

ఆడ నెమలిని ఆకర్షించడానికి, మగ నెమళ్లు తమ అందమైన ఈకలను విప్పి దాని చుట్టూ తిరుగుతాయి. ఇది వాటి జతకట్టే ప్రక్రియలో ఒక సాధారణ దశ. ఇతర జంతువులు, పక్షులు జతకట్టడం కోసం ఆడవాటిని ఆకర్షించినట్లే, నెమళ్లు కూడా నాట్యం చేసి ఆడ నెమళ్లను ఆకర్షిస్తాయి. వర్షాకాలం వాతావరణంలో ఆహ్లాదకరమైన మార్పును తెస్తుంది. వారాల తరబడి తీవ్రమైన వేడిని తట్టుకున్న నెమళ్లు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తాయి. ఈ ఆహ్లాదకరమైన మార్పు వాటిని మరింత చురుకుగా, శక్తిమంతంగా చేస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?
Recommended image2
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image3
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
Anand Mahindra Peacock Video : మీ మనసుల్ని తప్పకుండా కదిలిస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
Recommended image2
Peacock Feather నెమలి పింఛాలతో లక్కీ.. ఎక్కడ పెట్టాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved