MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Whisky: అంతరిక్షంలోకి విస్కీ ప్రయాణం... అక్కడ విస్కీని ఏం చేస్తారో తెలుసా?

Whisky: అంతరిక్షంలోకి విస్కీ ప్రయాణం... అక్కడ విస్కీని ఏం చేస్తారో తెలుసా?

Whisky:మద్యం ప్రియులను మత్తులో ముంచెత్తే విస్కీ ఎన్నో రకాలుగా లభిస్తుంది. చాలా కాలం నిలువ ఉన్న మద్యానికి విలువలెవక్కువ.. ధర కూడా ఎక్కువే. మరి అంతరిక్షంలో విస్కీ తయారయితే? పరిస్థితి ఎలా ఉంటుది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 25 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అంతరిక్షంలోకి విస్కీ ప్రయాణం...
Image Credit : Asianet News

అంతరిక్షంలోకి విస్కీ ప్రయాణం...

భూమిపై విస్కీని గ్లాసులో పోసుకుని తాగడం సాధారణమే. కానీ అదే విస్కీని అంతరిక్షంలోకి తీసుకెళ్తే ఏమవుతుంది? అక్కడ దాని రుచి మారుతుందా? బరువులేని వాతావరణంలో విస్కీ ఎలా ప్రవర్తిస్తుంది? అంతరిక్షంలో విస్కీని తయారు చేయడానికి లేదా దాని నాణ్యతను పరిశీలించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అంతరిక్ష పరిశోధనలోకి విస్కీ చేసిన ప్రయాణాన్ని పరిశీలించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అంతరిక్షంలో విస్కీని ఉంచితే ఏం జరుగుతుంది?
Image Credit : Asianet News

అంతరిక్షంలో విస్కీని ఉంచితే ఏం జరుగుతుంది?

మద్యం ప్రియులకు మేలైన రుచి అందించడానికి విస్కీని ఏళ్ల తరబడి చెక్క పీపాలలో నిల్వ ఉంచుతారు. భూమిపై జరిగే ఈ సుదీర్ఘ ప్రక్రియను 'ఏజింగ్' అంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. భూమిపై కాకుండా అంతరిక్షంలోని శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో విస్కీని ఉంచితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. అంతరిక్ష వాతావరణం మద్యం పరిపక్వత చెందే వేగాన్ని పెంచుతుందా లేదా అనే అంశాన్ని పరిశోధించడమే ప్రధాన లక్ష్యం. స్కాట్లాండ్, జపాన్ దేశాల ఇంజనీర్లు చేతులు కలిపి 'స్పేస్ పఫిన్' పేరుతో ఒక చిన్న క్యూబ్‌శాట్ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సెలక్ట్ చేసిన విస్కీ నమూనాలు, సంప్రదాయ పద్ధతిని ప్రతిబింబించే ఓక్ చెక్క ముక్కలను అమర్చి అంతరిక్షంలోకి పంపుతారు.

33
విస్కీని అక్కడ ఏం చేస్తారంటే?
Image Credit : Asianet News

విస్కీని అక్కడ ఏం చేస్తారంటే?

ఈ ప్రయోగాన్ని ఎలన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ సహకారంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చనున్నారు. అక్కడి జపనీస్ పరిశోధనా కేంద్రం సాయంతో ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెడతారు. భూమి చుట్టూ తిరిగే ఈ ఉపగ్రహం ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి కంప్లీట్ గా ఒక రౌండ్ వేస్తుంది. ఈ క్రమంలో మద్యం తీవ్రమైన ఎండ వేడిని, వెంటనే గడ్డకట్టే అతి శీతల చలిని వెంటవెంటనే తట్టుకోవాల్సి వస్తుంది.

నిరంతరం మారే ఈ విపరీత ఉష్ణోగ్రతలు విస్కీ రసాయన చర్యలను వేగవంతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా తక్కువ సమయంలోనే అద్భుతమైన, సరికొత్త ఘాటైన రుచి ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో అంతరిక్షంలో తయారయ్యే ప్రత్యేక మద్యాని మార్కెట్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

అంతరిక్షంలోనే మద్యం తయారి.. ?

ఐదు సంవత్సరాల పాటు ఈ ఉపగ్రహం అంతరిక్షంలోనే పరిభ్రమిస్తుంది. దీనిలోని ప్రత్యేక సెన్సార్లు మద్యం రంగు, చిక్కదనం, అణువులలో వచ్చే మార్పులను క్షణక్షణం రికార్డ్ చేస్తూ భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు పంపిస్తాయి. పరిశోధన ముగిసిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూమికి తిరిగి తీసుకురారు. కేవలం అది పంపించే డిజిటల్ సమాచారాన్ని మాత్రమే శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. అంతరిక్షంలో మద్యం నాణ్యత ఎలా మారుతుందో పూర్తి ఆధారాలు సేకరిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో అంతరిక్ష పరిస్థితులను ఉపయోగించి నేరుగా అంతరిక్షంలోనే విస్కీని తయారు చేసి భూమికి తెచ్చి విక్రయించే సరికొత్త వ్యాపార ఆలోచనలకు బలమైన పునాది పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Airplane Tires: విమానం టైర్లలో నింపేది గాలి కాదు.. మంటలు ఆపే ఆ వాయువు
Recommended image2
విషపూరిత పామును తిన్నాక కూడా ముంగిస ఎలా బతుకుతుంది? ఆ విషం ఏమవుతుంది?
Recommended image3
స్కూళ్లలో భయంకరమైన అల్లరి చేసే పిల్లల్లో ఈ దేశమే నెంబర్ వన్.. ఇక మనదేశంలో పరిస్థితి ఏంటి?
Related Stories
Recommended image1
విషపూరిత పామును తిన్నాక కూడా ముంగిస ఎలా బతుకుతుంది? ఆ విషం ఏమవుతుంది?
Recommended image2
Gold Capital: ఇండియాలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ ఎక్కడుందో తెలుసా? పెద్ద గోల్డ్ బ్రాండ్స్ అన్నిఇక్కడివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved