MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Rahul Gandhi Investments : రాహుల్ గాంధీ టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. ఏడాదిలోనే కోట్లు కుమ్మరించాయిగా!

Rahul Gandhi Investments : రాహుల్ గాంధీ టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. ఏడాదిలోనే కోట్లు కుమ్మరించాయిగా!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెట్టుబడి పెట్టిన ఏడు ముఖ్యమైన మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ స్టోరీలో వివరించాం. ఈ ఫండ్స్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. వాటి పనితీరు, రాహుల్ పెట్టుబడుల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 06 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాహుల్ గాంధీ పెట్టుబడులు..
Image Credit : X

రాహుల్ గాంధీ పెట్టుబడులు..

కాంగ్రెస్ నాయకులు దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పుకుంటారు. ఆయన కూడా ఆ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అది సాధ్యం కావడం లేదు. అయితే రాజకీయాలను కాస్త పక్కనబెడితే… రాహుల్ గాంధీ బాగా చదువుకున్నాడు. అతడు  చాలా తెలివిగా పెట్టుబడులు పెడతాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే రాహుల్ పెట్టుబడుల గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీ మ్యూచువల్ ఫండ్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టాడని అర్థమవుతోంది… అతడికి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టినవి టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

రాహుల్ గాంధీ HDFC స్మాల్‌క్యాప్ రెగ్యులర్ గ్రోత్ లో పెట్టుబడి పెట్టారు. ఈ స్కీమ్‌లో ఆయన మొత్తం 10,82,22,684 యూనిట్లు కొన్నారు. జూలై 3, 2026 నాటికి ఈ ఫండ్ యూనిట్ విలువ (NAV) రూ.138.46గా ఉంది. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ ఫండ్, కేవలం ఒక్క నెలలోనే 4.35 శాతం రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న మొత్తం ఆస్తుల విలువ (కార్పస్) రూ.38,809.48 కోట్లు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాహుల్ గాంధీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులివే..
Image Credit : ANI

రాహుల్ గాంధీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులివే..

రాహుల్ గాంధీ పెట్టుబడి పెట్టిన మరో మ్యూచువల్ ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్-గ్రోత్. దీని NAV రూ.79.33 కాగా, ఫండ్ సైజ్ రూ.3,302 కోట్లు. రాహుల్ గాంధీ ఈ ఫండ్‌లో 1,54,297 యూనిట్లు కలిగి ఉన్నారు… ఇది ఏడాదిలో 4.64% రాబడి ఇచ్చింది. 

ఇక రాహుల్ పెట్టుబడి పెట్టిన మరో మ్యూచువల్ ఫండ్ PPFAS ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. దీని NAV రూ.91.30, ఫండ్ సైజ్ రూ.1,41,446.73 కోట్లు. ఇందులో రాహుల్ 26,851,471 యూనిట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది నెలలో 2.19% రాబడి ఇచ్చింది.

రాహుల్ HDFC MCOP DP GRలో 11,763,377 యూనిట్లు, ఐసీఐసీఐ ఈక్యూ & డీఎఫ్ డీ గ్రోత్‌లో 5,253,773 యూనిట్లు పెట్టుబడి పెట్టారు. ఇవి ఏడాదిలో వరుసగా 6%, 4% పైగా రాబడిని అందించాయి.

Related Articles

Related image1
Mutual Fund: పెట్టుబడికి లాభం.. అవసరానికి లోన్.. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవడం ఎలా?
Related image2
SBFC Finance Listing: ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ బంపర్ లిస్టింగ్..ఒక్కో షేరుపై ఏకంగా 28 రూపాయలు లాభం..
35
ఐసిఐసిఐ, హెచ్డిఎప్సి లో రాహుల్ పెట్టుబడులు..
Image Credit : X

ఐసిఐసిఐ, హెచ్డిఎప్సి లో రాహుల్ పెట్టుబడులు..

రాహుల్ గాంధీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్‌లో 1,54,297 యూనిట్లు కొన్నారు. దీని NAV రూ.79.33. ఈ ఫండ్ ఏడాదిలో 5.42% రాబడి ఇచ్చింది. కంపెనీ ఫండ్ సైజ్ రూ.3,302 కోట్లు.

HDFC హైబ్రిడ్ డెట్ ఫండ్‌లో 1,07,071 యూనిట్లను రాహుల్ కలిగివున్నారు. ఈ ఫండ్ ఏడాదిలో 2.85% రాబడి ఇచ్చింది.

45
మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు ఏంటి?
Image Credit : ANI

మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు ఏంటి?

మార్కెట్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. మార్కెట్ ఒడిదొడుకులు వీటిపై నేరుగా ప్రభావం చూపవు. ఎందుకంటే మీ డబ్బును ఒకే స్టాక్‌లో కాకుండా, వేర్వేరు రంగాల కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఒక కంపెనీ లేదా సెక్టార్ నష్టపోయినా, మరో సెక్టార్ లేదా స్టాక్ పనితీరుతో మీ డబ్బుకు రక్షణ ఉంటుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.
55
రాహుల్ గాంధీ ఎంత పెట్టుబడి పెట్టారు?
Image Credit : Asianet News

రాహుల్ గాంధీ ఎంత పెట్టుబడి పెట్టారు?

ఏప్రిల్ 2024లో ఎన్నికల సంఘానికి (ECI) సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రాహుల్ గాంధీకి మొత్తం 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే సుమారు రూ.9.24 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నాయి… ఇందులో దాదాపు రూ.8.17 కోట్లు (సుమారు 90%) మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినవే. 

రాహుల్ గాంధీ మొత్తం 25 లిస్టెడ్ కంపెనీల షేర్లలో సుమారు రూ.4.33 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇవి కాకుండా స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ ఫండ్స్‌తో సహా ఏడు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో సుమారు రూ.3.81 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. 

గమనిక : ఈ సమాచారం ఆధారంగా పాఠకులు తీసుకునే ఎలాంటి నిర్ణయాలకు గానీ, వాటివల్ల కలిగే ప్రత్యక్ష/పరోక్ష నష్టాలకు గానీ ఏసియానెట్ బాధ్యత వహించదు. పాఠకులు సొంత బాధ్యతతో వ్యవహరించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
రాహుల్ గాంధీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
న‌మ్మ‌క ద్రోహం మ‌హా పాపం.. త‌ప్పు చేసి త‌ప్పించుకోవ‌డం అసాధ్యమ‌ని చెప్పే క‌థ
Recommended image2
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Recommended image3
Most Costly Cow: అంబానీ మాత్రమే కొనగలిగే ఆవు ఇది.. దీని ధర తెలిస్తే అవాక్కవుతారు
Related Stories
Recommended image1
Mutual Fund: పెట్టుబడికి లాభం.. అవసరానికి లోన్.. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవడం ఎలా?
Recommended image2
SBFC Finance Listing: ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ బంపర్ లిస్టింగ్..ఒక్కో షేరుపై ఏకంగా 28 రూపాయలు లాభం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved