మనవళ్లకు తాతల పేర్లు ఎందుకు పెడతారు? దీన్ని ఎవరు ప్రారంభించారు?
అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా చాలామంది పేరెంట్స్ తమ పూర్వీకుల పేర్లు పెడుతుంటారు… సీనియర్ ఎన్టీఆర్ పేరు జూనియర్ ఎన్టీఆర్ కు పెట్టినట్లు. ఇలా ఎందుుకు పెడతారు? ఈ కల్చర్ ఎలా ప్రారంభమయ్యింది?

మనవళ్లకు తాతల పేర్లు ఎందుకు?
పూర్వం చాలామంది తమ పిల్లలకు తండ్రిపేరో లేక తాతపేరో పెడుతుంటారు... ఇప్పటికీ కొందరు దీన్ని ఫాలో అవుతుంటారు. ఇలా తన తండ్రి నందమూరి తారక రామారావు (NTR) పేరునే కొడుకుకు పెట్టుకున్నాడు నందమూరి హరికృష్ణ... అతడే జూనియర్ ఎన్టీఆర్. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కూతురు షర్మిల కొడుకుకు కూడా తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టుకున్నాడు. ఇలా చాలామంది తాతలు, ముత్తాతల పేర్లను కలిగివుంటారు... కొందరు అమ్మాయిలకు కూడా నాన్నమ్మ పేర్లు కలిగివుంటారు.
ఇలా మనవళ్లు, మనవరాళ్లకు తాతల పేర్లు ఎందుకు పెడతారు? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దీన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం. అలాగే ఈ సాంప్రదాయం ఎలా ప్రారంభమయ్యింది? ఎవరి కాలంలో మొదలయ్యింది? అనేది కూడా తెలుసుకుందాం.
పిల్లలకు పూర్వీకుల పేర్లు ఎందుకు పెడతారు?
పూర్వకాలంలో ఇప్పటిలాగా జనన ధృవీకరణ పత్రాలు ఉండేవి కావు... వారి ఇంటిపేరు లేదా పేర్ల ఆధారంగానే గుర్తించేవారు. అందుకే చాలామంది తమకు పుట్టిన బిడ్డలకు తండ్రి పేరు పెట్టేవారు... దీంతో ఈ పేరు చెప్పగానే ఇతడు పలానా వ్యక్తి మనవడు అని, పలానా వ్యక్తి కొడుకు అని ఈజీగా గుర్తించేవారు.
పూర్వం ఒకే వంశానికి చెందిన చాలామంది రాజుల పేర్లు ఒకేలా ఉండేవి. ఇలా చరిత్రలో మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు... మొదటి హరిహర రాయలు, రెండవ హరిహరరాయలు... మొదటి పులకేశి, రెండవ పులకేశి పేర్లు వింటుంటాం. ఆ కాలంలో వంశ ప్రతిష్ఠను, పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేయడానికి మనవళ్లకు తాతల పేర్లు పెట్టేవారని చారిత్రకారులు చెబుతారు.
ఇక పునర్జన్మపై కూడా భారతీయులకు నమ్మకం ఎక్కువ. అందుకే చాలామంది ముసలివారు ఇప్పటికీ 'చచ్చి నీ కడుపున పుడతా' అంటుంటారు. ఇలా తన తల్లిదండ్రులు పిల్లల రూపంలో పుట్టారని భావించేవారు వారి పేర్లను పెట్టేవారు... ఇది కూడా మనవళ్లకు తాతల పేరు పెట్టే సాంప్రదాయానికి కారణమయ్యింది.
కేవలం భారతీయుల్లోనే కాదు ఇతర దేశాల్లోనూ ఈ కల్చర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాచీన గ్రీకు, రోమన్ కల్చర్ లో కూడా తాతల పేర్లను మనవళ్లకు పెట్టే సాంప్రదాయం చూడవచ్చు. ఇంకా అనేది దేశాల్లో ఈ కల్చర్ కనిపిస్తుంది.
తాతల పేర్లు మనవళ్లకు పెట్టే ఎప్పుడు ప్రారంభమయ్యింది?
భారతదేశంలో మొదటినుండి ఇలా మనవళ్లకు తాతల పేర్లు పెట్టే కల్చర్ ఉండేది కాదట... ఇది మధ్యలో వచ్చిందని చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా ఇక్ష్వాక రాజులు దీన్ని ప్రారంభించారని... అనంతరం దీన్ని ఇతర రాజవంశీకులు కూడా ఫాలో అయ్యారట. మొదట రాజవంశీయుల్లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం తర్వాత ప్రజల్లోకి పాకిందని... కాలక్రమేణ ఇది మరింత విస్తరించిందని చెబుతారు. ఇలా పాలకులతో పాటు ప్రజలు కూడా తమ పూర్వీకుల పేర్లను పిల్లలకు పెట్టుకోవడం ప్రారంభించారు.. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.
కేవలం పేర్ల విషయంలోనే కాదు మరికొన్ని సాంప్రదాయాలు కూడా ఈ ఇక్ష్వాకుల కాలంలోనే మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా హిందువుల్లో మేనత్త, మేనమామ కూతుళ్లు, కొడుకులను (బావ మరదళ్లు) పెళ్లిచేసుకునే కల్చర్ ఉంటుంది... ఇది కూడా కూడా వీరి కాలంలోనే ప్రారంభమయ్యిందట. అంటే రక్తసంబంధీకులు పెళ్లి చేసుకోవడం అనేది వీరి సాంప్రదాయమే.















