MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Diamond Rain: అక్కడ నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి.. ఎక్కడో తెలుసా?

Diamond Rain: అక్కడ నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి.. ఎక్కడో తెలుసా?

Diamond Rain: నీళ్లు వానలా కురవడం సహజం. కానీ చిన్న చిన్న వజ్రాలు వర్షంలా కురుస్తాయి. ఇది ఎక్కడో కాదు… వేరే గ్రహంపై. శాస్త్రవేత్తలు దీన్ని కొత్తగా కనుగొన్నారు. అసలు ఆ గ్రహంపై వజ్రాలు ఎందుకు కురుస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 09 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అక్కడ వజ్రాల వాన
Image Credit : AI

అక్కడ వజ్రాల వాన

ఆకాశం నుంచి నీళ్లు వర్షంగా కురువడం మనందరికీ తెలిసిందే. మరికొన్నిచోట్ల చేపలు, కప్పలు కూడా వర్షంలా కురుస్తాయి. కానీ ఒకచోట చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి. ఎక్కడో తెలుసా? అంతరిక్షంలోని ఒక గ్రహంపై.   శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇలాంటి ఒక గ్రహాన్ని కనుగొన్నారు. ఇక్కడి కార్బన్ మేఘాలు వజ్రాలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులను కలిగిఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Spacedaily.com ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ గ్రహం పేరు PSR J2322-2650b. శాస్త్రవేత్తలు 2017లోనే పల్సర్ టైమింగ్ టెక్నిక్‌తో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. అయితే, ఇటీవల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీని వాతావరణంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది.

ఈ గ్రహం పరిమాణంలో బృహస్పతి పరిమాణంలో ఉంటుంది. కానీ దీని వాతావరణం, అందులోని పదార్థాలు చాలా ప్రత్యేకంగా మార్చాయి. ఇది 'చనిపోయిన నక్షత్రం' చుట్టూ తిరుగుతుండటంతో చాలా వేడిగా, ప్రమాదకరంగా ఉంటుంది. దీని వాతావరణంలో పూర్తిగా కార్బన్, హీలియం మాత్రమే ఉన్నాయి. భూమిపై ఉండే ఆక్సిజన్, నైట్రోజన్ లాంటివి ఇక్కడ లేవు. పొగ, మసి లాంటి కణాలతో నిండిన దీని వాతావరణం చాలా వింతగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా వజ్రాలు తయారవుతాయి?
Image Credit : AI

ఎలా వజ్రాలు తయారవుతాయి?

ఈ కొత్త గ్రహంపై విపరీతమైన వేడి, తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ లాంటి కణాలు నెమ్మదిగా ఘనీభవించి వజ్రాలుగా మారతాయి. అందుకే శాస్త్రవేత్తలు ఇక్కడ 'వజ్రాల వర్షం' కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలు చూడలేదు. 

ఈ గ్రహం పుట్టుక రహస్యమే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఎక్కువగా వేధిస్తోంది. కార్బన్‌తో నిండిన ఈ గ్రహం ఎలా ఏర్పడిందనే దానిపై వారికి ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా గ్రహాలు ఏర్పడే పద్ధతికి ఇది ఎంతో భిన్నంగా ఉంది. ఈ గ్రహం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడమే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు.

Related Articles

Related image1
Onions: ఈ ఊరిలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు.. అది చట్టరీత్యా నేరం కూడా
Related image2
SBI Manager Salary: ఎస్‌బీఐ మేనేజర్ జీతం ఎంత? అన్ని కటింగ్స్ తరువాత చేతికొచ్చేది ఎంత?
33
మనకు తెలియన విశ్వం
Image Credit : AI

మనకు తెలియన విశ్వం

విశ్వంలో మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది. ఇలాంటి గ్రహాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి టెక్నాలజీ.. ఇలాంటి రహస్య గ్రహాలను అర్థం చేసుకోవడానికి కొత్త దారులు చూపిస్తోంది. ఈ ఆవిష్కరణ అంతరిక్ష విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, మనం ఊహించిన దానికంటే ఈ విశ్వం చాలా వింతగా, అద్భుతంగా ఉందని నిరూపిస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
World Wonders: కళ్లని మాయ చేసే రెయిన్ బో బిల్డింగ్స్..ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు ఇవి
Recommended image2
Property Buying Tips: వర్షాకాలంలోనే ఇల్లు కొనాలి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Related Stories
Recommended image1
Onions: ఈ ఊరిలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు.. అది చట్టరీత్యా నేరం కూడా
Recommended image2
SBI Manager Salary: ఎస్‌బీఐ మేనేజర్ జీతం ఎంత? అన్ని కటింగ్స్ తరువాత చేతికొచ్చేది ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved