మనదేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్.. 23 ప్లాట్ ఫామ్‌లు, రోజుకు ఈ 280కి పైగా రైళ్లు
భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఉంది. కాని దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఢిల్లీ, ముంబై నగరాల్లోనే పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయనుకుంటారు. నిజానికి అతి పెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ రైల్వే స్టేషన్.

ప్రపంచంలో అతి పెద్ద రైల్వే స్టేషన్
భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఎంతో విశాలమైనది. ఐఆర్‌సిటిసి.. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగాలను ఇస్తున్న సంస్థగా పేరు పొందింది. ఇక భారత దేశంలో రైల్వేస్టేషన్లో సంఖ్య తక్కువ ఏమీ కాదు. అయితే అతి పెద్ద రైల్వే స్టేషన్ ఏదో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఢిల్లీ, ముంబై, హైదరాబాద్... ఇలా ఈ పెద్ద నగరాల్లోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉంది అనుకుంటారు. నిజానికి అతి పెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జంక్షన్.
రోజుకు 280 రైళ్లు
హుగ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో 23 ప్లాట్ ఫామ్‌లు ఉన్నాయి. ప్రతిరోజు 280 కంటే ఎక్కువ రైళ్లు ఈ స్టేషన్ వైపు నుంచి ప్రయాణం చేస్తాయి. ప్రయాణికుల రద్దీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అత్యధిక రద్దీ కలిగిన రైల్వే స్టేషన్ కూడా ఇదే. ఇక్కడ ప్రతి నిమిషం ఒక రైలు వచ్చిపోతూనే ఉంటుంది. హుగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ కోల్‌కతాలోని ప్రధాన రైల్వే కేంద్రంగా చెప్పుకుంటారు. ప్రతిరోజు ఆరు లక్షలకు పైగా ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ నుంచే ప్రయాణాలు చేస్తారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్... ఇలా ప్రధాన రైలు ఎన్నో ఈ రైల్వే స్టేషన్ మీదుగా నడుస్తాయి. ఇది తూర్పు, దక్షిణ భారతదేశాన్ని ఇతర ప్రాంతాలకు అనుసంధానించే ముఖ్యమైన రైల్వే కేంద్రం.
ఎప్పుడు నిర్మించారు?
హుగ్లీ జంక్షన్ పునాది వేసింది బ్రిటిష్ పాలనలోనే 1954లో దీన్ని ప్రారంభించారు. 1906 ఇది పూర్తిగా సిద్ధమై పనిచేయడం ప్రారంభించింది. కాలం మారుతున్న కొద్దీ దీని నిర్మాణం, సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. ఈ రైల్వే స్టేషన్ 70 ఎకరాలలో విస్తీర్ణం విస్తరించి ఉంటుంది. దీనిలో వైఫై, ఫుడ్ కోర్టులు, వెయిటింగ్ రూమ్‌లు, ఆధునిక సౌకర్యాలు కలిగిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. 2018లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో జాబితాలోనూ చేర్చారు.
త్వరలో హైస్పీడ్ రైలు
ఈ స్టేషన్లో రద్దీ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. అందుకే రైల్వే అధికారులు నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రయాణికుల కారణంగా అక్కడ ఉద్యోగులకు ఊపిరి సలపనంత పని ఉంటుంది. ప్లాట్ ఫామ్‌ల సంఖ్యను కూడా పెంచుతూ పోవడం వల్ల మరింతగా పని పెరిగిపోయింది. డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో హైస్పీడ్ రైలు నెట్ వర్క్‌ను కూడా దీనికి అనుసంధానించే అవకాశం కనిపిస్తోంది.
హౌరా వంతెన అందం
హుగ్లీ జంక్షన్ ప్రయాణికుల కోసం మాత్రమే కాదు. ఎంతోమంది పర్యాటకులు కూడా ఇక్కడకు వచ్చి దర్శిస్తారు. ఇది ఒక ఆకర్షణీయమైన రైల్వే కేంద్రంగా మారింది. దీని భవనం చాలా భారీగా ఉంటుంది. అలాగే చారిత్రక కట్టడంలా కనిపిస్తుంది. ఈ స్టేషన్ చుట్టూ పెద్ద మార్కెట్ విస్తరించి ఉంది. అలాగే హౌరా వంతెన అందం కూడా దీని నుంచి చూడవచ్చు. హౌరా వంతెనను చూడడానికి వచ్చిన వాళ్ళు హౌరా జంక్షన్ ను కచ్చితంగా దర్శించాలి. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది.