MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts : నిజంగానే నడిచే చెట్లు ఉంటాయా?

Facts : నిజంగానే నడిచే చెట్లు ఉంటాయా?

సినిమాల్లో లేదంటే కథల్లో కదిలే చెట్ల గురించి వింటుంటాం. అయితే కొన్ని చెట్లు నిజంగానే ఓ చోటినుండి మరోచోటికి మారతాయని చెబుతుంటారు. ఇందులో నిజమెంత? సినిమాల్లో చూపించినట్లు నిజంగానే చెట్లు నడుస్తాయా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 09 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ చెట్టుకు నిజంగానే కాళ్ళు ఉంటాయా?
Image Credit : Gemini AI

ఈ చెట్టుకు నిజంగానే కాళ్ళు ఉంటాయా?

దక్షిణ అమెరికా వర్షారణ్యాల్లో కనిపించే సోక్రటియా ఎక్సోరిజా (Socratea exorrhiza) ను 'నడిచే తాటి చెట్టు' అని పిలుస్తుంటారు. స్థానిక ప్రజలు ఈ చెట్లు నిజంగానే నడుస్తాయని… ఓ చోటు నుండి మరోచోటుకు వెళతాయని చెబుతుంటారు. ఈ చెట్టు సూర్యరశ్మి కోసం నెమ్మదిగా కదులుతుందని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. కానీ శాస్త్రీయ పరిశోధనల్లో ఇది కేవలం అపోహ అని తేలింది. 

ఈ సోక్రటియా ఎక్సోరిజా చెట్టుకు భూమి పైకి కనిపించే ప్రత్యేకమైన 'స్టిల్ట్ రూట్స్' (stilt roots) ఉంటాయి. ఇవి చూడటానికి చాలా కాళ్లతో ఆ చెట్టు నిలబడినట్లు భ్రమ కల్పిస్తాయి. అందుకే టూరిస్ట్ గైడ్‌లు, స్థానికులు ఈ చెట్టు ఏడాదికి కొన్ని సెంటీమీటర్లు లేదా మీటర్లు కదులుతుందని నమ్ముతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
శాస్త్రవేత్తలు చెప్పేది ఇదే..
Image Credit : Chatgpt

శాస్త్రవేత్తలు చెప్పేది ఇదే..

ఈ 'నడిచే చెట్టు'పై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కోస్టారికాలోని 'సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ స్టడీస్' డైరెక్టర్ గెరార్డో అవాలోస్ (Gerardo Avalos) వంటి నిపుణులు ఈ సోక్రటియా ఎక్సోరిజా చెట్టుపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం… చెట్టు కాండం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి అస్సలు కదలదని వారు నిర్ధారించారు. చెట్టు వేర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారినా, కాండం మాత్రం ఒకే చోట స్థిరంగా ఉంటుందట. చెట్లు వాటంతట అవే వేర్లను పెకిలించుకుని, మళ్లీ పాతుకోలేవు అని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Fruit Trees: బాల్కనీలో కుండీల్లో సులువుగా పెరిగే 7 రకాల పండ్ల మొక్కలు ఇవే
Related image2
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
33
 సోక్రటియా ఎక్సోరిజా వేర్ల ప్రత్యేకత ఇదే...
Image Credit : Chatgpt

సోక్రటియా ఎక్సోరిజా వేర్ల ప్రత్యేకత ఇదే...

సోక్రటియా ఎక్సోరిజా చెట్టుకున్న ఈ ప్రత్యేకమైన వేర్ల వెనుక ఓ అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. ఈ వేర్లు చెట్టు నడవడానికి కాదు బతకడానికి అవసరమైన పనులు చేస్తాయి. ముఖ్యంగా వర్షారణ్యాల్లోని నీటితో నిండిన, వదులైన నేలల్లో ఉండే ఈ చెట్టుకు బలాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చేది ఈ వేర్లే. అంతేకాదు ఈ వేర్లు చెట్టు త్వరగా, నిలువుగా పెరిగేందుకు సాయపడతాయి. 

ఒకవేళ సోక్రటియా ఎక్సోరిజా చెట్టు పడిపోయినా, ఈ వేర్లు కొత్తవాటిని పెంచుకుని తిరిగి నిలబడటానికి సాయపడతాయి. ఇది చూడటానికి కదులుతున్నట్లు అనిపించినా, ఇది కేవలం చెట్టు మనుగడ కోసం ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన మార్పు. కాబట్టి 'నడిచే చెట్టు' అనేది కట్టుకథే అయినా, సోక్రటియా ఎక్సోరిజా తాటి చెట్టు ప్రకృతి అద్భుతాలకు ఒక నిదర్శనం.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ganja : గంజాయిని లీగల్ గా సాగు చేయవచ్చు, ఉపయోగించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Telugu Saying: కుండ పగిలితే పగిలింది కానీ, కుక్క గుణం బయటపడింది.. ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image3
Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?
Related Stories
Recommended image1
Fruit Trees: బాల్కనీలో కుండీల్లో సులువుగా పెరిగే 7 రకాల పండ్ల మొక్కలు ఇవే
Recommended image2
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved