నందమూరి జానకిరామ్ భార్య పెట్టిన కండిషన్స్.. అందుకే జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారా ?
నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి.. నందమూరి హరికృష్ణ మనవడిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. హరికృష్ణ మనవడి పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం.
బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి కొత్త హీరోలు వస్తుంటే ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎవరు వచ్చినా జనాలు బాగా చర్చించుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి.. నందమూరి హరికృష్ణ మనవడిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. హరికృష్ణ మనవడి పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం.
NTR
ఇతడు నందమూరి జానకి రామ్ కొడుకు. ఇప్పుడు జానకిరామ్, హరికృష్ణ ఇద్దరూ లేరు. ఇద్దరూ వేర్వేరు కారు ప్రమాదాల్లో మరణించిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పుడు ఈ కుర్రాడి బాధ్యత ఇతర కుటుంబ సభ్యులదే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఈ కుర్రాడికి బాబాయ్ స్థానంలో ఉన్నారు. చూస్తుంటే ఈ సినిమాకి వాళ్ళిద్దరి మద్దతు నామమాత్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది.
దీనిపై వైవిఎస్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మాటలని బట్టి తానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్, తారక్ మద్దతు ఉందా అని మీడియా ప్రశ్నిస్తే వైవిఎస్ చౌదరి డొంక తిరుగుడుగా సమాధానం ఇస్తున్నారు. అసలు వాళ్ళిద్దరి పేర్లు చెప్పడానికి కూడా వైవిఎస్ చౌదరి ఇష్టపడడం లేదు. పైగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఈ హీరోకి చుట్టాలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఈ అబ్బాయికి తల్లి ఉంది కదా.. ముందు తల్లి అనుమతి అవసరం.. ఆ తర్వాతే చుట్టాలు అని వైవిఎస్ చౌదరి అన్నారు. నందమూరి జానకిరామ్ భార్య తనకి కొన్ని కండిషన్స్ పెట్టారని.. వాటి ప్రకారమే తాను నడుచుకుంటున్నాను అని చౌదరి సమాధానం ఇచ్చారు. ఆ కండిషన్స్ ఏంటో కూడా చెప్పారట.
చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడు వస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ కి హీరోయిన్ గా వీణా రావు అనే కూచిపూడి డ్యాన్సర్ ని పరిచయం చేస్తున్నారు. సో హీరో హీరోయిన్ ఇద్దరికీ ఇది డెబ్యూ చిత్రమే.