బిగ్ బాస్ ఒక అబద్దం, చూడకండి.. మాజీ కంటెస్టెంట్ సరయూ సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది యూట్యూబర్.. కాంట్రవర్షియల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది సరయూ.. యూట్యూబర్ గా తాను చేసే వీడియోలు కూడా... ఘాటుగానే ఉంటాయి. ఈక్రమంలో ఆమె తాజాగా బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 7
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ హడావిడి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే కుడి ఎడమైతే పొరపాటు లేదు అంటూ.. నాగార్జున ప్రోమో వైరల్ అవుతుంది. ప్రోమో వల్ల సీజన్ 7పై ఇంట్రెస్ట్ భారీగా పెరిగిపోయింది. నాగార్జున చెప్పిన డైలాగ్ ఈ సీజన్ పై మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ షోకి ఎంత క్రేజ్ అయితే ఉందో అదే రేంజ్ లో విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి.
లాస్ట్ సీజన్ రేటింగ్ ధారుణంగా పడిపోయింది. గతంలో మాదిరి బిగ్ బాస్ లేదని.. చప్పగా ఉందంటూ విమర్షలు కూడా వచ్చాయి.. అవి పక్కన పెడితే బిగ్ బాస్ పై గట్టిగా విమర్షలు చేసిన వారు కూడా ఉన్నారు. ఈ షోను బ్యాండ్ చేయాలని కోర్టు వరకూ వెళ్లిన వారు కూడా లేకపోలేదు. అయితే ఎవరో ఏదో విమర్షలు చేస్తే.. పెద్ద పట్టింపు ఉండదు కాన.. బిగ్ బాస్ హౌస్ కు రెండు సార్లు వెళ్ళిన కంటెస్టెంట్ చేసిన వియర్షలు సంచలనంగా మారాయి.
తాజాగా ప్రముఖ యూట్యూబర్, బోల్డ్ బ్యూటీ సరయు బిగ్ బాస్ పై తన దైన స్టైల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న రియాలిటీ షోలన్నీ అబద్దం అని చెప్పుకొచ్చింది. కొంతమంది డబ్బులిచ్చి మరీ వారిని వారు ప్రమోట్ చేసుకోవడానికి షోకి వస్తారని.. బిగ్ బాస్ మేనేజ్ మెంట్ కూడా కావాలని కొంతమందిని ప్రమోట్ చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Bigg Boss Sarayu
జనాలను పిచ్చివాళ్లను చేస్తారని.. షోలో హడావిడి చూసి.. అది నిజమేనని నమ్మి మనం పిచ్చోళ్ళం అవుతున్నామని, ఇలాంటి షోలు చూడకండి అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 5 తో పాటు..బిగ్ బాస ఓటీటీలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది సరయూ. కాని మధ్యలోనే ఆమె బయటకు వచ్చేసింది. తాను ఈ షోకి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసునని ఆమె అన్నారు. రెండు సార్లు హౌస్ లోకి వెళ్లిన సరయూ.. ఇలా మాట్లాడటం అందరికి షాక్ కలిగిస్తుంది.
యూట్యూబర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సరయూ.. బిగ్ బాస్ కు వెళ్ళితన తరువాత బాగా ఫేమస్ అయ్యింది. ఇంక తన యూట్యూబ్ ఛానెలో సమాజానికి సబంధించిన విషయాలను తీసుకుని..బోల్డ్ కంటెంట్‌తో యుట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిపోయింది బ్యూటీ. కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించింది సరయూ.
తాజాగా ఆమె నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన 18 పేజిస్ లో కూడా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. మరి సరయూ చేసిన కామెంట్స్ కు ఎవరైనా స్పందిస్తారా.... బిగ్ బాస్ పై ఆమె ఎందుకు ఈ మాట అన్నదో తెలియాల్సి ఉంది.